దోహాలో అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం.. హాజరుకానున్న భారత్

దోహాలో అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం.. హాజరుకానున్న భారత్
x
Highlights

దోహాలో అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పంద కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.

దోహాలో అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పంద కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. ఈ ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 2001 చివరిగా ఆఫ్ఘనిస్తాన్ లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది. ఈ ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమానికి భారత్‌ను ఖతార్ ప్రభుత్వం ఆహ్వానించిందని, దీనికి భారత రాయబారి పి కుమారన్ హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో తాలిబాన్లతో కూడిన కార్యక్రమానికి భారత్ అధికారికంగా హాజరుకావడం ఇదే మొదటిసారి.

వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి మరియు సయోధ్య ప్రక్రియలో భారతదేశం కీలక వాటాదారుగా ఉంది. ఈ క్రమంలో 2018 నవంబర్‌లో మాస్కోలో ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియపై జరిగిన సమావేశానికి భారత్ ఇద్దరు మాజీ దౌత్యవేత్తలను "నాన్-అఫీషియల్" సామర్థ్యంతో పంపింది. రష్యా నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నత స్థాయి తాలిబాన్ ప్రతినిధి బృందం, ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులతో పాటు అమెరికా, పాకిస్తాన్, చైనాతో సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిలిచిపోయిన ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియను ముందుకు తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా, రష్యా, ఇరాన్ వంటి ప్రధాన దేశాలు ఇక్కడికి చేరుతున్నాయి. ఆఫ్ఘన్ నియంత్రణలో ఉన్న జాతీయ శాంతి మరియు సయోధ్య ప్రక్రియకు భారతదేశం మద్దతు ఇస్తోన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories