India on Gaza Crisis: గాజాలో పరిస్థితులపై ఇండియా ఆందోళనలు.. కీలక సూచనలు చేసిన ప్రభుత్వం!

India on Gaza Crisis
x

India on Gaza Crisis: గాజాలో పరిస్థితులపై ఇండియా ఆందోళనలు.. కీలక సూచనలు చేసిన ప్రభుత్వం!

Highlights

India on Gaza Crisis: మానవీయ సహాయాన్ని పెంచేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని భారత్‌ కోరింది.

India on Gaza Crisis: భారత ప్రభుత్వం ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలో తలెత్తిన మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణ కారణంగా అనేక మంది అమాయకులు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని పేర్కొంది. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిచ్చింది.

ఐక్యరాజ్యసమితి అత్యవసర ప్రత్యేక సమావేశంలో భారత ప్రతినిధి రుచిరా కంబోజ్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడు నెలలుగా కొనసాగుతోందని, దీని ప్రభావం గాజాలో మరింత తీవ్రంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తున్నదని, మానవీయ సహాయాన్ని పెంచేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరింది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడులను భారత్ ఖండించింది. ఉగ్రవాదానికి ఎలాంటి మద్దతు ఉండరాదని, ప్రజలను బలవంతంగా బంధించడం పూర్తిగా అనైతికమని పేర్కొంది. అలాగే, హమాస్ యుద్ధ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. గాజాలో పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండేందుకు, మానవతా సహాయాన్ని తక్షణమే పెంచాలని భారత్ కోరుతోంది. ఇప్పటికే భారత్ పాలస్తీనాకు సహాయాన్ని అందజేసిందని, భవిష్యత్తులో కూడా అవసరమైన మద్దతు అందించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించింది.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు తక్షణమే చర్చలు ప్రారంభించాలని భారత్ కోరుతోంది. రెండు దేశాల సూత్రాన్ని సమర్థిస్తూ, ఇరువర్గాల భద్రత, స్వతంత్రత కాపాడేలా నేరుగా చర్చలు జరపాలని సూచించింది. అంతేకాకుండా, పాలస్తీనా ఐక్యరాజ్యసమితి సభ్యత్వాన్ని భారత్ మద్దతు ఇస్తోందని, భవిష్యత్తులో దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories