నేడే అమెరికా నుంచి స్వదేశానికి భారతీయుల రాక..

నేడే అమెరికా నుంచి స్వదేశానికి భారతీయుల రాక..
x
Highlights

క‌రోనా వైరస్ ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇక అమెరికాలో కరోనా మ‌హ‌మ్మ‌రి క‌రాళ నృత్యం చేస్తుంది.

క‌రోనా వైరస్ ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇక అమెరికాలో కరోనా మ‌హ‌మ్మ‌రి క‌రాళ నృత్యం చేస్తుంది. రోజరోజుజూకు క‌రోనా పాజిటివ్ కేసులపెరిగిపోతున్నాయి. ఈ సంఖ్య 13 లక్షలకు పైగా ఉండగా... మరణాల సంఖ్య 2.80 లక్షలు దాటింది. న్యూయార్క్‌లో అత్య‌ధిక కేసులు మ‌ర‌ణాలు సంభ‌విచాయి. అందుకే భార‌తీయులు తీరిగి ఇండియాకు వ‌చ్చేయాల‌ని య‌త్నిస్తున్నారు. మ‌రి కొంద‌రూ విసాల గ‌డువు ముగియ‌డంతో అక్క‌డ లాక్ డౌన్ కార‌ణంగా చిక్కుకుపోయారు.

అమెరికా నుంచి భారతీయుల్ని వెనక్కి తెచ్చేందుకు ఏడు విమానాలు రంగంలోకి దిగాయి. ఇక భారత ప్రభుత్వం కూడా వందే భారత్ పేరుతో... విదేశీయుల్ని ఇండియాకి రప్పిస్తోంది. ఇందులో భాగంగా మ‌న దేశ వాసుల‌ను ఇండియాకు ర‌ప్పించే కార్య‌క్ర‌మం ఇవాళ్టి నుంచి మొదలవుతోంది. మొదటి బ్యాచ్‌లో 200 మంది శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో బయలుదేరింది.

మొదటి వారంలో 25,000 మంది అమెరికా నుంచి ఇండియా వచ్చేందుకు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. కేంద్రం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్ని వారిని తెచ్చేందుకు రంగంలోకి దింపింది. మొదటి విమానం ఇవాళ ముంబైలో ల్యాండ్ అవుతుంది. సోమవారం హైదరాబాద్ చేరుతుంది. న్యూయార్క్ నుంచి 300 మందితో విమానం ముంబైకి వచ్చి గుజరాత్‌ లోని అహ్మదాబాద్ కు వెళ్లనుంది. విమానాల్లో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ ఇండియాకు రావాల్సి ఉంటుంది. దీంతో కొన్నివారాల‌పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories