దక్షిణ కొరియాలో 40 రోజులుగా ఒక్క మరణం కూడా లేదు

దక్షిణ కొరియాలో 40 రోజులుగా ఒక్క మరణం కూడా లేదు
x
Highlights

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారికి వణికిపోతోంది. అయితే దక్షిణ కొరియాలో మాత్రం ఈ టెన్షన్ లేదు.

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారికి వణికిపోతోంది. అయితే దక్షిణ కొరియాలో మాత్రం ఈ టెన్షన్ లేదు. దక్షిణ కొరియాలో, గత 40 రోజులలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ (కెసిడిసి) మరణాల గురించి సమాచారం ఇచ్చింది. దేశంలో ఇప్పటివరకు 240 మంది మరణించారు. గురువారం, 6 కొత్త ఇన్ఫెక్షన్లతో పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల 708 కు పెరిగింది. మొత్తం 8 వేల 501 మందికి నయం కావడంతో..

ప్రస్తుతం రెండు వేల మందికి పైగా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 5 లక్షల 69 వేల మందిని పరీక్షించారు. ఇందులో ఎక్కువగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారానే పరీక్షించారు. కాగా ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే ఇటీవల దక్షిణకొరియాలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో అధికార పార్టీ విజయం సాధించింది. అది కూడా ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు కావడం విశేషం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories