Wildfire: కాలిఫోర్నియాను కుదిపేస్తున్న వైల్డ్‌ఫైర్

Huge Wildfire in California
x
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ వైల్డ్ ఫైర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Wildfire: కాలిబూడిదయిన ఇళ్లు, వాహనాలు

Wildfire: మరో భారీ కార్చిచ్చుతో అగ్రరాజ్యంలోని కాలిఫోర్నియా అతలాకుతలం అవుతోంది. పొడి వాతావరణానికి తోడు బలమైన గాలులు తోడవడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భారీ కార్చిచ్చుతో కాలిబూడిదవుతున్న ఇళ్లు బూడిద కుప్పలను తలపిస్తున్నాయి. కార్చిచ్చు ధాటికి శాక్రమెంటో కౌంటీలోని రాంచో మెరీనా పార్క్‌లోని భవనం, 25 మొబైల్ హౌస్‌లు, 16 రిక్రియేషన్ వాహనాలు తగలబడిపోయాయి. ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరోవైపు, కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. అయితే, కార్చిచ్చు కారణంగా ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని, శాన్ జోకిన్ కౌంటీలో మాత్రం ఓ వ్యక్తి గాయపడ్డాడని, ఐదు మొబైల్ హౌస్‌లు ధ్వంసమయ్యాయని తెలిపారు. సౌత్ శాంటా బార్బారా కౌంటీ కోస్ట్‌లో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. సోమవారం ఒక్కసారిగా ఎగసిపడిన కార్చిచ్చు ఇవాళ కాస్త నెమ్మదించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories