బిగ్ బ్రేకింగ్ : అభిశంసనకు గురైన డోనాల్డ్ ట్రంప్

బిగ్ బ్రేకింగ్ : అభిశంసనకు గురైన డోనాల్డ్ ట్రంప్
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాకు షాక్ తగిలింది. ఆయన అభిశంసనకు గురయ్యారు. ట్రంప్ పై అభిశంసనకు యూఎస్ హౌస్ ఆమోదం తెలిపింది. అధికార దుర్వినియోగం...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాకు షాక్ తగిలింది. ఆయన అభిశంసనకు గురయ్యారు. ట్రంప్ పై అభిశంసనకు యూఎస్ హౌస్ ఆమోదం తెలిపింది. అధికార దుర్వినియోగం మరియు కాంగ్రెస్‌కు ఆటంకం అనే రెండు ఆరోపణలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించడానికి ప్రతినిధుల సభ బుధవారం సమావేశమైంది. ట్రంప్‌పె పెట్టిన రెండు అభిశంసన తీర్మానాలను ఆమోదింపజేసేందుకు చట్టసభ్యులు చర్చలో పాల్గొన్నారు.

అంతకుముందు ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియను ఆ పార్టీ సహేతుకంగా సమర్థించుకుంటూ ప్రతినిధుల సభ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఓటింగ్ జరపడంతో అభిశంసనకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. దీంతో జనవరి నుంచి ట్రంప్ పై విచారణ మొదలు కానుంది. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన మూడో వ్యక్తిగా ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు.

Show Full Article
Print Article
Next Story
More Stories