Top
logo

26 ఏళ్లు క్వారంటైన్‌లోనే ఉన్న టైఫాయిడ్‌ మేరీ గురించి తెలుసా?

26 ఏళ్లు క్వారంటైన్‌లోనే ఉన్న టైఫాయిడ్‌ మేరీ గురించి తెలుసా?
X
Mary Mallon
Highlights

క‌రోనా కార‌ణంగా అనుమానితుల‌ను 14 రోజులు క్వారంటైన్ లో ఉండ‌డానికే ప్ర‌భుత్వాలు విఫ‌ల‌య‌త్నం చేస్తున్నాయి. మ‌రి కొంద‌రూ అధికారుల క‌ళ్లు క‌ప్పి క్వారంటైన్ నుంచి పారిపోయి వ‌స్తున్నారు.

క‌రోనా కార‌ణంగా అనుమానితుల‌ను 14 రోజులు క్వారంటైన్ లో ఉండ‌డానికే ప్ర‌భుత్వాలు విఫ‌ల‌య‌త్నం చేస్తున్నాయి. మ‌రి కొంద‌రూ అధికారుల క‌ళ్లు క‌ప్పి క్వారంటైన్ నుంచి పారిపోయి వ‌స్తున్నారు. అయితే ఒక మ‌హిళ మాత్రం 26ఏళ్ల‌పాటు క్వారంటైన్ లో ఉందంట్లే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. ఈ ఘ‌ట‌న ఐర్లాండ్ లో జ‌రిగింది. .'టైఫాయిడ్‌ మేరీ'' పేరుతో పలు పుస్తకాలు చాలామందికి తెలిసిందే. 1993లో ఓ డాక్యుమెంటరీ చిత్రం కూడా వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.

మేరీ మాలన్‌ 1868లో నార్త్‌ ఐర్లాండ్‌లో జన్మించింది. 1884లో మేరీ మాల‌న్ అమెరికాకు వలస వచ్చింది. 1990- 1907 మధ్యకాలంలో న్యూయార్క్‌లో కొంద‌రి ఇళ్లలో మేరీ వంటమనిషిగా పనిచేసింది. 1901లో మమరొనెక్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో మేరీ పనికి చేరిన 15 రోజుల‌ తర్వాత ఆ కుటుంబంలోని వారికి టైఫాయిడ్ వ‌చ్చింది. దీంతో మేరి అక్కడ పని మానేసి మాన్‌హట్టన్‌లోని మ‌రోక‌రి ఇంట్లో పనికి కుదిరింది. కొద్ది రోజులకే ఆ ఫ్యామిలీ మొత్తం టైఫాయిడ్ బారిన ప‌డ్డారు. డయేరియాతో కొంద‌రు బాధపడ్డారు. ఆ ఇంటి ప‌నిచేసే మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మేరీ ప‌నిమానేసింది. మళ్లీ 1906లో ఒయిస్టర్‌ బేలోని నలుగురు ఇళ్లలో ప‌నికి చేరింది. దీంతో ఇంట్లోవాళ్లు టైఫాయిడ్‌తో ఆస్ప్రత్రుల్లో చేరారు. మేరీకి ఏం అర్థం కాలేదు. చివరగా న్యూయార్క్‌లో బ్యాంక్‌ అధికారి ఛార్లెస్‌ హెన్రీ వారెన్‌ ఇంట్లో వంట మనిషి ప‌ని దొరికింది. మేరీ పని చేయడం ప్రారంభించిన 2 వారాలకే హెన్రీ ఇంట్లో 10 మందికి జ్వరం పిడించింది. ఒయిస్టర్‌ బేలోనే నివాసం ఉండే కుటుంబాలు తక్కువ సమయంలో టైఫాయిడ్ బారిన ప‌డ‌డం ఒక్కసారిగా పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. ఇంత జరుగుతున్న మేరీ ఏమీ అర్థం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. బాక్టీరియా క‌లుషిత‌ ఆహారం, నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తోంది. అయితే, ఈ బాక్టీరియా బారిన ప‌డిన వ్యాక్తుల వ‌స్తువులు, ఆహారం తినడం ద్వారా ఇది వ్యాపించే అవకాశాలున్నాయి. మేరీ వంటపని చేస్తుంది. దీంతో ఆమె ద్వారా బాక్టీరియా ఆహారంలో కలవడం ఇతరులకు ఈ బాక్టీరియా సోకి టైఫాయిడ్‌, డయేరియా రావ‌డానికి మేరి కార‌ణ‌మైంది.

జార్జి సొపర్ అనే వైద్యుడిని 1906లో మేరి ప‌నిచేసిన కుటుంబం నియ‌మించింది. టైఫాయిడ్‌ ఎలా వచ్చిందో తెలుసుకోవాల‌ని ఆ పరిశోధకుడికి సూచించింది. మేరీ వల్లనే టైఫాయిడ్‌ వస్తుందని అత‌డు గ్ర‌హించాడు. అయితే అదే ప్రాంతంలో స్థానికంగా మరికొంద‌రికి టైఫాయిడ్ రావ‌డంతో అతడి అనుమానం బలపర్చేలా ఉన్నాయి. ఆ ఇంట్లో పని చేసే ఇద్దరు పనివాళ్లకు టైఫాయిడ్‌ రాగా.. ఇంటి యాజమాని కూతురు టైఫాయిడ్‌ కారణంగా చ‌నిపోయింది. దీంతో సోప‌ర్ మేరీని వైద్య పరీక్షలకు సహకరించాలని కోరాడు. వైద్య ప‌రీక్ష‌ల‌కు మేరీ ఒప్పుకోలేదు. వారి జ్వ‌రానికి త‌న‌కు సంబంధమేంటని సోప‌ర్ ను ప్ర‌శ్నించింది. మేరీ పని చేసిన ఇళ్లకు వెళ్లి వారందరిని సోప‌ర్ విచారించాడు. టైఫాయిడ్‌ రావడానికి మేరినే కారణమని నిర్ధారించుకున్నాడు. డాక్టెర్ల‌ను తీసుకొని మేరి ఇంటికి వెళ్లాడు.

తొలిసారి క్వారంటైన్‌ మూడేళ్లు..

టైఫాయిడ్‌ కేసులు పెరుగుతుండటంతో న్యూయార్కలొ పెర‌గ‌డానికి మేరినే కార‌ణ‌మ‌ని హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ గుర్తించారు. దీంతో 1907లో అరెస్టు చేసి క్వారంటైన్‌ చేశారు. బలవంతంగా నార్త్‌ బ్రదర్‌ ఐలాండ్‌లోని ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా మేరీ దేహంలో ఉంద‌ని గుర్తించారు. మేరీ ద్వారానే ఇత‌రులకు బాక్టీరియా సోకుతుందని వైద్యులు నిర్ధారించారు. వంట ప‌ని మ‌నేయాల‌ని చెప్పినా ఆమె విన్లేదు. దీంతో మేరీని మూడేళ్లు క్వారంటైన్‌లో ఉంచారు.

అయితే మేరీని ఎక్కువ రోజులు క్వారంటైన్‌లో ఉంచడం స‌రైంది కాద‌ని, అప్పటి హెల్త్‌ కమిషనర్ భావించారు. మళ్లీ వంటపని చేయనని, బ్యాట్లీరియా ఇత‌రుల‌కు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని హెచ్చ‌రించి మేరీని వ‌ద‌లిపెట్టారు. దీనికి ఆమె ఒప్పుకోవడంతో ఫిబ్రవరి 19, 1910లో విడుదలై న్యూయార్క్‌కు చేరుకుంది.

క్వారంటైన్ బ‌య‌ట‌కు వ‌చ్చిన మేరి చాకలి పనిలో చేరింది. అలా 5ఏళ్లపాటు అదే పనిలో కొనసాగింది. తక్కువ జీతం వస్తుండటంతో తిరిగి వంట‌ప‌నే ఎంచుకుంది. కొన్ని ఇళ్లలో పని చేయగా.. అక్కడి వారందరికి టైఫాయిడ్‌ వచ్చింది. 1915లో మేరీ వల్ల అనేక మంది టైఫాయిడ్‌ బారిన పడ్డారు. న్యూయార్క్‌లోని ఓ ఉమెన్ హాస్ప‌ట‌ల్ లో మేరీ పని చేయగా.. 25 మంది మహిళలు టైఫాయిడ్ సోకింది. ఇద్దరు మ‌ర‌ణించారు. మేరీ పనేనని గుర్తించిన పోలీసులు... మార్చి 27, 1915న ఆమెను అదుపులోకి తీసుకొని నార్త్‌ బ్రదర్ ఐలాండ్ లోని ఓ క్వారంటైన్‌కు తరలించారు.

అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. మేరీ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. మీడియా మొత్తం మేరీ గురించే. క్వారంటైన్‌లో ఖాళీగా ఉన్న మేరీనికి ఆ ఆసుప‌త్రిలోనే ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని కల్పించారు. దీంతో అక్క‌డే కాలం వెళ్లదీసింది. అయితే 1932లో పక్షవాతం రావడంతో మేరీ పూర్తిగా మంచానికి పరిమితమైంది. ఆరేళ్ల త‌ర్వాత‌ నవంబర్‌ 11, 1938న న్యూమోనియాతో మేరి క‌న్నుమూసింది. ప్ర‌భుత్వాధికారులే ఆమె ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించారు.

Web Titlehistory of Mary Mallon typhoid fever
Next Story