అమెరికాలో హై టెన్షన్

Joe Biden swear in program
x

జో బైడెన్ (పాత చిత్రం)

Highlights

అమెరికాలో హైటెన్షన్‌ మొదలైంది. రేపే 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. రేపటితో నాలుగేళ్ల ట్రంప్‌ శకానికి తెరపడినట్లే.. రేపు...

అమెరికాలో హైటెన్షన్‌ మొదలైంది. రేపే 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. రేపటితో నాలుగేళ్ల ట్రంప్‌ శకానికి తెరపడినట్లే.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ట్రంప్‌ గద్దె దిగనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ అనుచరులు దాడులకు తెగబడచ్చని వాషింగ్టన్‌ ఉలిక్కిపడుతోంది. కనీవిని రీతిలో భద్రత బలగాలను మోహరించి నగరాన్ని మిలటరీ కంటోన్మెంట్‌గా మార్చేశారు. ఈనెల 6న కేపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్ధతుదారులు దాడికి దిగారు. మరోవైపు సంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా హాజరుకావడం లేదు. దీంతో క్యాపిటల్‌ భవనంలో ఏం జరుగుతుందని అమెరికన్లు టెక్షన్ పడుతున్నారు. కేపిటల్‌ భవన ప్రాంగణం సమీపానే ప్రమాణస్వీకారం జరగనున్నందున అంతర్గతంగా ఎవరైనా దాడులకు దిగొచ్చేమోనన్న భయాలు భద్రతా అధికారులను వెన్నాడుతున్నాయి.

ఈ మేరకు సుమారు 25వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ని రంగంలోకి దింపారు. గతంలో అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవాలకు నియమించిన భద్రతకు ఇది మూడు రెట్లు ఎక్కువ. అయితే విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బందే తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడవచ్చన్న విషయం ఆందోళనకు గురిచేస్తోంది. ట్రంప్‌-అనుకూల గార్డ్స్‌ ఎవరూ లేకుండా సీక్రెట్‌ సర్వీస్‌, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు- కేపిటల్‌ భవనానికి ఓ మైలు దూరంలో నిర్మానుష్యమైన ఓ గుడారంలో నిన్న ఓ చిన్న అగ్నిప్రమాదం జరిగింది. ఇది తెలిసిన వెంటనే కేపిటల్‌ భవనాన్నిలాక్‌డౌన్‌ చేశారు. హుటాహుటిన అందరినీ బయటకు పంశారు. గంటన్నర తర్వాత కేపిటల్‌ భవనాన్ని తెరిచారు. మొత్తానికి ఏం జరుగుతుందన్న టెక్షన్‌ అమెరికాను వెంటాడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories