చంద్రయాన్ 2: హలో విక్రం..ఉన్నావా? లండర్ విక్రం తో సంబంధాల కోసం నాసా విశ్వ ప్రయత్నాలు!

చంద్రయాన్ 2: హలో విక్రం..ఉన్నావా? లండర్ విక్రం తో సంబంధాల కోసం నాసా విశ్వ ప్రయత్నాలు!
x
లాండర్ విక్రం జీవిత కాలం చంద్రుని లెక్కల ప్రకారం ఒక్కరోజే. కానీ, మన కాలమానం ప్రకారం 14 రోజులు.
Highlights

చంద్రయాన్ 2 లో భాగంగా జబిలిపై అడుగిడిన లాండర్ విక్రం తో తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోకు నాసా తన పూర్తి సహకారాన్ని అందిస్తోంది. తనకున్న అన్ని అవకాశాల ద్వారా విక్రం ను పలకరించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా లాండర్ విక్రం చంద్రునిపై దేగే క్రమంలో ఇస్రోతో సంకేతాల్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, మొదట్లో విక్రం క్రాష్ లాండింగ్ తో దెబ్బతిని ఉంటుందని భావించినా, తరువాత అది క్షేమంగానే చంద్రునిపై దిగిందనీ, కాకపోతే పక్కకు ఒరిగిపోయిందనీ గుర్తించినట్టు ఇస్రో ప్రకటించింది. ఇక విక్రం తో సంబంధాలు సాధించడానికి ఇస్రో పట్టు వదలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇస్రో చంద్రయాన్ 2 కు సంబంధించి నాసా సానుకూలంగా స్పందించింది. చంద్రయాన్ విషయంలో భారత శాస్త్రవేత్తల కృషిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక విక్రం తో సంకేతాలు పునరుద్దరించడంలో ఇస్రోకు నాసా తన సహకారాన్ని అందిస్తోంది. విక్రం జీవితకాలం కేవలం 14 రోజులే. ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయాయి. దీంతో నాసా ఇస్రోకి సహకరించడానికి నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి ఇస్రో కూడా అంగీకరించిందనీ ఇప్పటికే విక్రం తో సంబంధాల కోసం నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోందనీ చెబుతున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ గ్రౌండ్ స్టేషన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా విక్రమ్‌తో సంకేతాలు పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

2005లో నాసా ప్రయోగించిన స్పై శాటిలైట్ ఇమేజింగ్ భూ కేంద్రంతో సంకేతాలు నిలిచిపోగా దానిని గుర్తించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త టిల్లే మాట్లాడుతూ.. కాలిఫోర్నియాలోని డీఎస్ఎన్ స్టేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ల్యాండర్‌‌తో కమ్యూనికేషన్‌కు ప్రయత్నిస్తున్నట్టు నిర్ధరించారు. నాసా చేస్తున్న ప్రయత్నాలపై ట్వీట్ చేశారు. చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించడానికి డిఎస్‌ఎన్‌ విభాగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, గత రెండు రోజుల నుంచి సిగ్నల్ పంపుతోందని పేర్కొన్నారు.

'ల్యాండర్‌కు ఆర్ఎఫ్ ద్వారా సంకేతాలు పంపినప్పుడు చంద్రుడు రేడియో రిఫ్లెక్టర్‌గా పనిచేస్తుంది.. దీంతో 8,00,000 కిలోమీటర్ల భ్రమణం తర్వాత భూమిపై ఉన్న సిగ్నల్‌లో కొంత భాగాన్ని తిరిగి పంపుతుంది.. మిగతా డీఎస్ఎస్ కేంద్రాల ద్వారానే ఈ ప్రక్రియ సాగుతోందని తాను నమ్మకంగా ఉన్నట్టు' టిల్లే తెలిపారు. నాసాకు చెందిన డీఎస్ఎస్ కేంద్రాలు దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో మూడు చోట్ల ఉన్నాయి. భూమికి 120 డిగ్రీల కోణంలో ఉన్న ఈ మూడు కేంద్రాల ద్వారా ఏ ఉపగ్రహానాన్నైనా అంతరిక్షంలో గుర్తించే సామర్థ్యం ఉంది. ప్రతి కేంద్రాలోనూ 26 మీటర్ల ఎత్తు 70 మీటర్ల వ్యాసం కలిగిన కనీసం నాలుగు అతిపెద్ద యాంటిన్నాలు ఉంటాయి. ఒకే సమయంలో అనేక వ్యోమనౌకలతో నిరంతరాయంగా కమ్యూనికేట్ చేయగలవు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories