ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!
x
Highlights

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సులవేసి, నార్త్ మాలుకు ద్వీపాల మధ్య మొలుక్కా సముద్రంలో ఈ భూకంపం ఏర్పడింది....

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సులవేసి, నార్త్ మాలుకు ద్వీపాల మధ్య మొలుక్కా సముద్రంలో ఈ భూకంపం ఏర్పడింది. 24 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1 గా నమోదైంది. దీంతో అధికారులు 8 నగరాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

భూకంపం కారణంగా టెర్నెటే నగరంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. నగరంలోని కొన్ని ఆసుపత్రులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రిల్లోని రోగులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంతవరకూ ఎటువంటి సమాచారం అందలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories