Indians in America: వీసా రద్దుల్లో ఇండియన్స్‌ టాప్‌.. ఎంత పని చేశావ్‌ ట్రంప్‌!

Indians in America
x

Indians in America: వీసా రద్దుల్లో ఇండియన్స్‌ టాప్‌.. ఎంత పని చేశావ్‌ ట్రంప్‌!

Highlights

Indians in America: ఆ ఏజెన్సీకి అందిన మొత్తం 327 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భారతీయ విద్యార్థుల నుంచి వచ్చాయని తెలుస్తోంది.

Indians in America: ఇండియన్ విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొంటున్న అనూహ్య విసా రద్దుల వేధింపులపై తాజా నివేదిక గంభీర చర్చకు దారి తీస్తోంది. విద్య కోసం వలస వెళ్లిన వారిలో వేలాది మంది ఇప్పుడు తిరిగి దేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యం నిబంధనల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు అనేక విద్యార్థుల జీవితాలను డిస్టర్బ్ చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) విడుదల చేసిన తాజా పాలసీ బ్రీఫ్ ప్రకారం, విద్యార్థుల వీసాలు రద్దు చేసిన మొత్తం కేసులలో సుమారు 50 శాతం భారతీయులవి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ ఏజెన్సీకి అందిన మొత్తం 327 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భారతీయ విద్యార్థుల నుంచి వచ్చాయని తెలుస్తోంది. వీసా రద్దుతో పాటు SEVIS రికార్డులను కూడా మూసివేయడమే దీనిలో మరొక ప్రధాన అంశం.

ఇదే సమయంలో వీసా రద్దుకు కారణాల జాబితా ఆశ్చర్యకరంగా ఉంది. ట్రాఫిక్ లాంటి మైనర్ చట్టాల ఉల్లంఘనలు, తరచూ తేలికపాటి ఫైన్‌లు, లేదా కేసులు ఉండకపోయినా.. వీసాలు రద్దవడం గమనార్హం. వాస్తవానికి ఈ కేసులలో కేవలం రెండు మాత్రమే రాజకీయ చట్రాలకు సంబంధించినవి కావడం మరింత స్పష్టతనిస్తుంది. చాలా మంది విద్యార్థులు OPT (Optional Practical Training) పథకం కింద అమెరికాలో ఉన్నవారే. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా నుంచే అధికంగా అమెరికాకు విద్యార్థులు వెళ్లుతున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నట్లు అంచనా. వారిలో దాదాపు 97,500 మంది వరకు OPT కింద ఉద్యోగాల్లో ఉన్నారు.

అయితే SEVIS రద్దు కారణంగా విద్యార్థులు తమ ఉద్యోగాలు కొనసాగించలేకపోవడం, స్టేటస్‌ను పునరుద్ధరించుకునే ప్రక్రియ చాలా కష్టంగా మారడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక విద్యాసంస్థలు, లాయర్లు, స్టూడెంట్ కమ్యూనిటీ అందరూ కలిసే ఇప్పుడీ సమస్యపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువైతే, విదేశీ విద్య కోసం అమెరికాను ఎంపిక చేసుకునే భారతీయుల అభిముఖత క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీసా వ్యవహారాల్లో పారదర్శకత లేకుండా వ్యవహరించడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories