Top
logo

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

Gun Fires Between Security Forces and Terrorists in Poonch Sector Jammu and Kashmir Poonch Sector
X

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్(ఫైల్ ఫోటో)

Highlights

*పూంచ్ జిల్లాలో టెర్రరిస్టులకు భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు *కాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు ఇద్దరు సైనికులకు గాయాలు

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టారులో టెర్రరిస్ట్ ఆపరేషన్‌ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ తో సహా ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూంచ్‌లోని మెంధర్ తహసీల్‌లోని బింబర్ గాలి గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల సంచారంతో రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Web TitleGun Fires Between Security Forces and Terrorists in Poonch Sector Jammu and Kashmir
Next Story