Gulf Crisis: భారత్ నెత్తిన ఖతార్ పిడుగు

Gulf Crisis: మధ్య ప్రాచ్యంలో యుద్ధం వేళ భారత్ కు గ్యాస్ సరఫరాలను తగ్గిస్తున్నామంటూ ఖతార్ చెప్పింది.
x

Gulf Crisis

Highlights

Gulf Crisis: మధ్య ప్రాచ్యంలో యుద్ధం వేళ భారత్ కు గ్యాస్ సరఫరాలను తగ్గిస్తున్నామంటూ ఖతార్ చెప్పింది. ఇది మన దేశ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపొచ్చు

Gulf Crisis: ప్రపంచ ఇంధన ముఖచిత్రంలో మరోసారి అలజడి మొదలైంది. ఇరాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ తీరంలో ఉద్రిక్తతలు పెరగడంతో, భారత్ ఇంధన అవసరాలకు కీలక ఆధారమైన ఖతార్ నుంచి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఉత్పత్తిదారు అయిన ఖతార్ ఎనర్జీ, దాడుల తదనంతర పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం భారత ఆర్థిక వ్యవస్థపై పిడుగులా పడింది.

భారత్ ఏటా దిగుమతి చేసుకునే 27 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీలో సింహభాగం (40 శాతం) ఖతార్ నుంచే వస్తుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారానే మన దిగుమతుల్లో 60% ఎల్‌ఎన్‌జీ, సగం ముడి చమురు ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఈ కీలక మార్గం మూతబడటం భారత్ ముంగిట పెను సవాలును నిలిపింది.

Gulf Crisis: ఖతార్ సరఫరా తగ్గించడంతో భారతీయ దిగ్గజ సంస్థలైన పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, గెయిల్, ఇండియన్ ఆయిల్ (IOC) అప్రమత్తమయ్యాయి. ఈ ప్రభావం ప్రధానంగా కింది రంగాలపై ఉండనుంది.సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎన్‌జీ సరఫరాను కొనసాగిస్తామని కంపెనీలు చెబుతున్నప్పటికీ, పరిశ్రమలకు ఇచ్చే గ్యాస్‌లో 10-30 శాతం మేర కోత విధించనున్నారు. మన ఎరువుల పరిశ్రమ పూర్తిగా దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీపైనే ఆధారపడి ఉంటుంది. సరఫరా తగ్గితే ఉత్పత్తి ఖర్చులు పెరిగి, వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు.విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంట గ్యాస్ నెట్‌వర్క్‌లు ఈ సరఫరా గొలుసుపైనే ఆధారపడి ఉన్నాయి.

ఒప్పందం ప్రకారం రావాల్సిన షిప్‌మెంట్‌లు తగ్గడంతో, కంపెనీలు ఇప్పుడు స్పాట్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. అయితే అక్కడ ధరలు మండిపోతున్నాయి.ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జీ ధర మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 25 డాలర్ల వద్ద ఉంది. ఇది పాత ఒప్పంద ధరల కంటే దాదాపు రెండు రెట్లు అధికం.

ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి సరఫరాను సేకరించడం, నిల్వలను సమర్థవంతంగా వాడటంపై దృష్టి సారించాయి. అయినప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొంటే తప్ప మన ఇంధన భద్రతకు పూర్తిస్థాయి భరోసా దొరకదు.యుద్ధ మేఘాలు త్వరగా వీడిపోకపోతే, వంటగది నుంచి కర్మాగారాల వరకు ఈ గ్యాస్ సెగ తప్పకపోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories