టైమ్స్‌ పర్స్‌న్ ఆఫ్‌ ది ఇయర్‌(2019) అవార్డు ఆమెకే దక్కింది.. ఎందుకో తెలుసా?

టైమ్స్‌ పర్స్‌న్ ఆఫ్‌ ది ఇయర్‌(2019) అవార్డు ఆమెకే దక్కింది.. ఎందుకో తెలుసా?
x
Highlights

ప్రపంచంలో ఏ మార్పు చోటు చేసు చేసుకోవాలన్నా, ఏదైనా తిరుగుబాటు మొదలవ్వాలన్నా అది ముందు ఒక్కరి తోనే ప్రారంభం అవుతుంది.

ప్రపంచంలో ఏ మార్పు చోటు చేసు చేసుకోవాలన్నా, ఏదైనా తిరుగుబాటు మొదలవ్వాలన్నా అది ముందు ఒక్కరి తోనే ప్రారంభం అవుతుంది. ఆ ఒక్కరి ఆలోచనే పది మందిలో ఆలోచనను కలింగించేలా చేస్తుంది. అదే కోణంలో ఓ చిన్నారి ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ప్రేరణ కల్పించింది. సామాజిక సృహతో అందరి మన్ననలు పొందుతోంది. ప్రతి శుక్రవారం తాను చేసే నిరసన అందరినీ ఆలోచింపచేసింది. అసలు ఎవరా అమ్మాయి, ఏం చేసింది అనుకుంటున్నారా.. తెలుసుకోవాలని అనుకుంటున్నారా..

పూర్తి వివరాల్లోకెళితే స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తన పుట్టిన రోజు సందర్బంగా స్వీడన్ పార్లమెంట్‌ వెలుపల ఏడు గంటల పాటు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా వీక్లీ ఫ్రైడే నిరసన కార్యక్రమాన్ని థన్‌బర్గ్‌ ప్రతి శుక్రవారం నిర్వహిస్తానని తెలిపారు. దీంతో ఆ ఆమెకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. గత ఏడాది కాలంగా తాను చాలా బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ ఏడాది జీవితంలో ఏం సాధించాలో సరియైన అవగాహన వచ్చిందని స్పష్టం చేసారు.

ధన్‌బర్గ్‌ పదిహేనేళ్ల వయస్సు నుంచే ప్రతి శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టి మరీ స్వీడన్‌ పార్లమెంట్ వెలుపల కార్బన్ ఉద్గారాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేవారన్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిరసన దీక్ష చేపట్టానని చెప్పారు. తనకు పుట్టిన రోజున కేక్ దొరక్కపోవచ్చు కానీ, అందరం కలిసి డిన్నర్‌ చేద్దామని భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మాట్లాడారు. తాను చేస్తున్న కార్యక్రమాలు ప్రభావం చూపుతున్నాయని థన్‌బెర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ప్రేరణ కలిగించారు. ఆమె చేస్తున్న కృషికి టైమ్స్‌ పర్స్‌న్ ఆఫ్‌ ది ఇయర్‌ (2019) అవార్డు లభించిందని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories