Coronavirus: ఏప్రిల్ 10 వరకు ఇంటినుంచే పనిచేయండి : గూగుల్

Coronavirus: ఏప్రిల్ 10 వరకు ఇంటినుంచే పనిచేయండి : గూగుల్
x
Highlights

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉత్తర అమెరికాలో పనిచేస్తున్న తన ఉద్యోగులందరినీ ఏప్రిల్ 10 వరకు ఇంటి నుండి పని చేయమని కోరింది. అంతేకాదు ప్రపంచంలోని వివిధ...

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉత్తర అమెరికాలో పనిచేస్తున్న తన ఉద్యోగులందరినీ ఏప్రిల్ 10 వరకు ఇంటి నుండి పని చేయమని కోరింది. అంతేకాదు ప్రపంచంలోని వివిధ శాఖలకు చెందిన గూగుల్ ఉద్యోగులందరూ తమ అనుకూలతను చూసుకోవాలని.. కరోనా వైరస్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సదరు సంస్థ సూచించింది.

అయితే ఇంటినుంచే పనిచేయడం అనేది తప్పనిసరి కాదని.. ఉద్యోగులు కార్యాలయాలకి కూడా వచ్చి పనిచేసుకోవచ్చని పేర్కొంది. కాగా అమెరికాలో COVID19 కేసుల సంఖ్య 1000 దాటడంతో గూగుల్ ఉద్యోగులకు ఈ సూచనలు వచ్చాయి.

యుఎస్ మరియు కెనడాలోని తన ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని గూగుల్ కోరినట్లు పలు వార్తా ప్రచురణలు నివేదించాయి. ఈ ప్రచురణలలో ఒకదానికి ఇమెయిల్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు గూగుల్ యొక్క గ్లోబల్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ రాకోవ్ దృవీకరించారు.

ఇక ఇంతకుముందే వాషింగ్టన్ రాష్ట్రంలోని తన ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. అలాగే శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతంలోని ఉద్యోగులకు కూడా ఇదే విధమైన మార్గదర్శకం ఇచ్చారు. సీటెల్‌లోని మైక్రోసాఫ్ట్, మరియు ట్విట్టర్‌తో సహా చాలా సాంకేతిక సంస్థలు ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయాలని సూచించాయి. గూగుల్, అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్ సహా టెక్నాలజీ కంపెనీల నుండి కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories