గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ట్రాన్స్‌లేట్ ఫీచర్..

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ట్రాన్స్‌లేట్ ఫీచర్..
x
Highlights

ఎక్కడికైనా వెళ్లాలంటే చాలు అడ్రస్ మరిచిపోయినా, లేదా ఒక మనిషి ఎక్కడున్నాడో తెసులుకోవాలన్నా వేరేవాళ్లని అడిగి తెలుసుకునేవారు. కానీ సాంకేతిక రంగం ఇప్పుడు...

ఎక్కడికైనా వెళ్లాలంటే చాలు అడ్రస్ మరిచిపోయినా, లేదా ఒక మనిషి ఎక్కడున్నాడో తెసులుకోవాలన్నా వేరేవాళ్లని అడిగి తెలుసుకునేవారు. కానీ సాంకేతిక రంగం ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. ఎవరికైనా అడ్రస్ దొరకకపోయినా లేదా, మర్చిపోయినా, ఎంత దూరం వెళ్లలనే విషయాలను గురించి తెలుసుకోవాలన్నా అందరూ ఒకే యాప్ ను వాడుతున్నారు. మరొకరితో పని లేకుండా గూగల్ మ్యాప్ లో చూస్తూ వెళ్లిపోతున్నారు.

అయితే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన మ్యాప్ యాప్‌లో మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతుంది. ఇతర దేశాలకు వెళ్లినపుడు చాలా మందికి అక్కడి భాష్ అర్ధం కాదు. దీంతో వారు చాలా ఇబ్చందులు ఎదుర్కొంటారు. ఆ విషయం గురించి అధ‌్యయనం చేసిన గూగుల్ సంస్థ ఏ భాషనైనా అర్ధం చేసుకునే విధంగా త్వరలో ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ను వాడే యూజర్లు వేరే దేశాల్లో పర్యటిస్తున్నపుడు అక్కడి భాషలో ఉండే ప్రాంతాల పేర్లను తమ ఫోన్‌లో ఉన్న భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే అవకాశం కల్పించనుంది.

అంతేకాక మ్యాప్ యాప్లో టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీ ద్వారా అక్కడ ప్రాంతాల పేర్లను ఫోన్‌లో ఉన్న డిఫాల్ట్ లాంగ్వేజ్‌లో బయటకు పెద్దగా చదువే టెక్నాలజీని తేనుంది. దీని ద్వారా వేరే భాషలో ఉన్న ప్రాంతాల పేర్లను కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ను త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై గూగుల్ మ్యాప్స్ యాప్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రపంచంలోని 50 భాషల యూజర్లకోసం ఈ ట్రాన్స్‌లేట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories