లాక్ డౌన్ ఉన్నప్పటికీ 'చర్చిలకు' మాత్రం అనుమతి..

లాక్ డౌన్ ఉన్నప్పటికీ చర్చిలకు మాత్రం అనుమతి..
x
Highlights

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే 35 లక్షల మంది మహమ్మారి భారిన పడ్డారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే 35 లక్షల మంది మహమ్మారి భారిన పడ్డారు.. ఈ తరుణంలో జర్మనీలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ఉన్నప్పటికీ చర్చిలకు మాత్రం అనుమతి లభించింది. ఈ విషయాన్నీ స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. అంతకుముందు మత పెద్దలు , అధికారుల మధ్య అనేక వారాల పాటు చర్చలు జరిగాయి. మత పెద్దలు చర్చిలు కచ్చితంగా తెరవాలని పట్టుబట్టారు.

దీనికి తోడు ప్రజలు కూడా ఒత్తిడి తెస్తున్నారు.. దాంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. కొన్ని షరతులతో జర్మనీలో చర్చిలు తెరవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ప్రజలు మాత్రం పరిమిత సంఖ్యలోనే చర్చిలలో ప్రార్ధనలు చేసుకోవాలి. పాస్టర్లు, భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించి ప్రార్థన చేయాలి.

అంతేకాదు ప్రతి ఒక్కరు కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి. అయితే పాటలు పాడటం మాత్రం నిషేధించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పాస్టర్లకు సూచించారు. మరోవైపు, లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జర్మనీలో స్టుట్‌గార్ట్ మరియు బెర్లిన్‌లో వందలాది మంది ప్రదర్శనలు ఇచ్చారు. దీంతో ప్రజలకు సర్ది చెప్పుకోలేక ప్రభుత్వం అవస్థలు పడుతోంది. ఇదిలావుంటే జర్మనీలో కరోనావైరస్ కేసులు లక్షా 66 వేలకు పెరిగాయి.. ఇందులో కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.. మొత్తం ఇప్పటివరకూ లక్షా 26 మంది కోలుకున్నారు.. అలాగే 6,866 మంది మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories