మాజీ క్రికెటర్‌ సోదరుడు కాల్చివేత

మాజీ క్రికెటర్‌ సోదరుడు కాల్చివేత
x
Highlights

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ సోదరుడిని కేప్ టౌన్ లోని రావెన్స్‌మీడ్‌లో కాల్చి చంపారు. ఆయన వయసు 32 సంవత్సరాలు. ఈ ఘటన..

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ సోదరుడిని కేప్ టౌన్ లోని రావెన్స్‌మీడ్‌లో కాల్చి చంపారు. ఆయన వయసు 32 సంవత్సరాలు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం వారి ఇంటి నుండి మీటర్ల దూరంలోనే జరిగింది. తన సోదరుడ్ని కొందరు దుండగులు కాల్చి చంపారని వెర్నోన్‌ ఫిలాండర్‌ తన వ్యక్తిగత ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. అందులో ఇలా పేర్కొన్నారు.. 'నా సోదరుడు టైరోన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మా సొంత ఊరిలోనే ఇది జరిగింది. ఈ కష్టసమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాను.. మీడియా కూడా సంయమనం పాటించాలి.. ఎటువంటి తప్పుడు వార్తలు రాయొద్దు. ఊహాగానాలతో దర్యాప్తు కష్టంగా మారిపోతుంది. టైరోన్‌ ఎప్పుడూ మా మనసుల్లో ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.

కాగా స్థానిక నివేదికల ప్రకారం, టైరోన్ కాల్పులు జరిగిన సమయం లో పొరుగువారికి నీటితో ఉన్న ట్రాలీని పంపిణీ చేస్తున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు వచ్చి కాల్పులకు తెగబడ్డారని నివేదికల సారాంశం.. బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు రావెన్స్‌మీడ్‌ లోని 7వ అవెన్యూ , వెబ్నర్ స్ట్రీట్ వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ ఏడాది ప్రారంభంలో 34 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెర్నాన్ ఫిలాండర్ రిటైర్ అయ్యారు.. అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నారు అయితే అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ లో చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories