Tonga: టోంగాలో మొట్టమొదటి కరోనా కేసు

టోంగాలో మొట్టమొదటి కరోనా కేసు(ఫైల్ ఫోటో)
* శుక్రవారం తొలి కరోనా కేసు నమోదు * న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
Tonga: గత 20 నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. అయితే దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఒక ద్వీపమైన టోంగాలో ఇప్పుడు తొలి కరోనా కేసు నమోదయ్యింది. దేశంలో శుక్రవారం తొలి కరోనా కేసు నమోదయ్యిందని ఆ దేశ ప్రధాని వెల్లడించారు.
న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందని పేర్కొన్నారు. ఫ్లైట్ ఎక్కే సమయంలో కరోనా టెస్ట్ చేసుకోగా నెగెటివ్ వచ్చిందని అయితే టోంగాకు వచ్చిన తర్వాత చేసిన టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందన్నారు.
దీంతో వెంటనే ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించామని తెలిపారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో దేశ ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, లాక్ డౌన్ కు సిద్ధమవ్వాలని ప్రధాని సూచించారు.
లక్షమంది జనాభా ఉన్న టోంగా దేశం న్యూజిలాండ్‌కు 2వేల, 380కిలోమీటర్ల దూరంలో, ఫిజికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు ఈ దేశంలో కరోనా కేసులు నమోదు కాకపోవడానికి ముందు జాగ్రత్త చర్యలే కారణం.
ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోందని తెలిసిన వెంటనే తమ దేశంలోకి విదేశీయులు రాకుండా టోంగా ప్రభుత్వం నిలువరించింది. గతేడాది మార్చి నుంచే దేశంలో ఎమెర్జెన్సీని ప్రకటించింది. కరోనా కేసులు లేకున్నా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే 86శాతం తొలిడోసు 62శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసింది.
మరోవైపు విదేశాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి రావడం కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో టోంగాలోనూ విదేశీ ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ఆ దేశానికీ పాకింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారని, వీలైంత త్వరగా వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అమెలియా తెలిపారు.
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMT