కొత్త సంవత్సరంలో తొలి జననం అక్కడే.. ఇండియాలోనే పుట్టిన ఎక్కువమంది చిన్నారులు!

కొత్త సంవత్సరంలో తొలి జననం అక్కడే.. ఇండియాలోనే పుట్టిన ఎక్కువమంది చిన్నారులు!
x
Highlights

జనవరి 1- అన్ని విబేధాలకూ అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా పండుగ రోజు. ఆ రోజు ప్రారంభమే జోష్ తో ఉంటుంది. ప్రపంచమంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోతుంది. ఆరోజు...

జనవరి 1- అన్ని విబేధాలకూ అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా పండుగ రోజు. ఆ రోజు ప్రారంభమే జోష్ తో ఉంటుంది. ప్రపంచమంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోతుంది. ఆరోజు పుట్టినరోజు వస్తే.. ఇక ప్రపంచ పండగ మనదే అనిపిస్తుంది కదూ. ప్రతి ఏటా జనవరి ఒకటిన ఎంతో మంది జన్మిస్తారు. ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రాంభమైన తొలి క్షణాల్లో చిట్టి పాపాయి ఫిజీ దేశంలో పుట్టింది. ఇక చివరి క్షణాల్లో అమెరికాలో చిన్నారి ఊపిరి పోసుకుంది.

ఇక యునిసెఫ్ చెబుతున్న ప్రకారం జనవరి ఒకటిన మన దేశంలోనే అత్యధిక జననాలు సంభవించాయి. ప్రపంచం అంతా కలిపి జనవరి 1న 3,92,078 మంది జన్మించగా.. ఒక్క భారత్‌లోనే 67,385 మంది పురుడు పోసుకున్నారు. ఇక ఆ తరువాతి స్థానాల్లో చైనా (46,299), నైజీరియా (26,039), పాకిస్థాన్ (16,787), ఇండోనేషియా (13,020), అమెరికా (10,452) నిలిచాయి. అంటే, ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 నాటి జననాల్లో భారత్‌లోనే 17 శాతం మంది పుట్టారు.

ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలలో ఒకటైన యునిసెఫ్, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో చిన్నారుల సంక్షేమం, అభివృద్ధికి సహాయం చేసే వేదికగా నిలుస్తోంది. ఆ సంస్థ ప్రతి ఏడూ జనవరి ఒకటిన జన్మించిన వారి వివరాలు ప్రకటిస్తుంది. అదేవిధంగా ప్రపంచవ్యవాప్తంగా శిశువుల సంక్షేమం, వారి స్థితిగతులకు సంబంధించిన నివేదికలు ఇస్తుంది. పసివారి జీవనం లో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఆయా దేశాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటుంది. ముఖ్యంగా శిశు మరణాలను తగ్గించే విషయంలో యూనిసెఫ్ చేసిన కృషి అసమానమైనది. ఆ సంస్థ కృషి కారణంగానే ప్రపంచ దేశాల్లో శిశు మరణాల సంఖ్య గతం కంటే తగ్గుముఖం పట్టింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories