'గులాబీ పౌడర్‌' తో మంటలు అదుపు

గులాబీ పౌడర్‌ తో మంటలు అదుపు
x
Highlights

అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు అదుపు చేయడానికి నీళ్లు పోయడం చూసాం. కానీ ఈ దేశంలో మాత్రం గులాబీ రంగు పౌడర్ ను చల్లుతున్నారు. ఆస్ట్రేలియా తూర్పు కోస్తా...

అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు అదుపు చేయడానికి నీళ్లు పోయడం చూసాం. కానీ ఈ దేశంలో మాత్రం గులాబీ రంగు పౌడర్ ను చల్లుతున్నారు. ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు అన్ని ప్రాంతాలలోకి పాకుతుంది. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నగా మొదలైన ఈ చిచ్చు వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని 1,50,000 హెక్టార్లలో ఉన్న అడవులను ఇప్పటివరకు దహించింది. అంతే కాకుండా ఆ మంటలు బుధవారం కూడా కొనసాగాయి. అందో అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నఇండ్లకు మంటలు అంటుకోకుండా ఉండడానికి అమ్మోనియంతో తయారు చేసిన గులాబీ రంగు పౌడర్ ని హెలికాప్టర్ తో పట్టణంలోని అన్ని ప్రాంతాలలో, అడవిలో చల్లించారు.

మంటలు ఆర్పడానికి ఉపయోగించిన ఈ పౌడర్ చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు తెలుపుతున్నారు. ఈ పౌడర్ కి దగ్గరగా ఉన్న వాళ్లకి ఎక్కువగా ప్రమాదం కాదు కానీ, పౌడర్ ని చల్లే వారికి, చేతితో ముట్టుకునే వారికి చాలా ప్రమాదం అని తెలిపారు. అంతే కాక ఈ పొడి ద్వారా కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కార్లపై, ఇండ్లపై చల్లిన ఈ పొడిని కడిగేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పౌడరును ముందుగా నీటితో కడిగి డిటర్జెంట్, బ్రష్‌లు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని తెలిపారు. చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు, కాళ్లకు జారిపోని బూట్లను ధరించాలని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి 220 డాలర్ల జరిమానా విధిస్తామని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అమ్మోనియం, డైఅమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్‌ కలిగిన ఈ పొడి మంటలు వ్యాపించకుండా ఉంటుందన్నారు. ఇది ఘాటైన వాసనను ఉంటుంది కాబట్టి శ్వాస సంబంధిత ఇబ్బందులు, చర్మంపై దద్దులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మంటల నుంచి అందరినీ రక్షించడం కోసమే ఈ అమ్మోనియంతో కూడిన పొడిని చల్లామని, ఇదేం విష పదార్థం కాదని రూరల్‌ ఫైర్‌ సర్వీస్‌ అధికార ప్రతినిధి ఇన్‌స్పెక్టర్‌ బెన్‌ షెపర్డ్‌ మీడియాకు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories