ట్రంప్‌ రాజీనామా!

ట్రంప్‌ రాజీనామా!
x
Highlights

అగ్రరాజ్యం అమెరికా ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఓ నకిలీ ఎడిషన్‌ కారణంగా అమెరికా దేశప్రజలే కాక వైట్ హౌస్ సిబ్బంది సైతం నిర్ఘాంతపోయింది. అమెరికా...

అగ్రరాజ్యం అమెరికా ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఓ నకిలీ ఎడిషన్‌ కారణంగా అమెరికా దేశప్రజలే కాక వైట్ హౌస్ సిబ్బంది సైతం నిర్ఘాంతపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజీనామా చేశారని 'వాషింగ్టన్‌ పోస్ట్‌' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 'అన్‌ప్రెసిడెంటెడ్‌' అనే శీర్షికతో రాసిన కథనంలో ట్రంప్‌ రాజీనామాతో ప్రపంచదేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించింది. 2019, మే 1వ తేదీతో ఉన్న ఈ పత్రికను కొందరు వాషింగ్టన్‌తో పాటు వైట్‌హౌస్‌ సమీపంలో ఉచితంగా పంచిపెట్టారు. అయితే ఇందులో మునుపటి తేదీ ఉండటం వలన ఇది ఇది నకిలీ ఎడిషన్‌ అని గుర్తించారు. అయితే ఈ నకిలీ ఎడిషన్‌తో తమకు సంబంధంలేదని వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రకటన చేసింది. ఇది 'యస్‌ మెన్‌' అనే గ్రూపు నకిలీ పత్రిక అని అమెరికా జర్నలిస్ట్‌ రామ్సే చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories