ఫేస్‌బుక్ కొత్త ఆప‌రేటింగ్ సిస్టమ్‌..?

ఫేస్‌బుక్ కొత్త ఆప‌రేటింగ్ సిస్టమ్‌..?
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో చాలా మంది యువత ఫేస్‌బుక్, వాట్సప్, ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వ‌ర్క్ లను ఉపయోగిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో చాలా మంది యువత ఫేస్‌బుక్, వాట్సప్, ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వ‌ర్క్ లను ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ సంస్థలకు పోటీగా కొత్త సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. దీంతో సోషల్ నెట్‌వ‌ర్క్ లు ప్రపంచంలో మరింత ముందుకు సాగిపోతున్నాయి. ఇదే తరహాలో త్వర‌లోనే ఓ నూత‌న ఆప‌రేటింగ్ సిస్టమ్ (ఓఎస్‌) ప్రముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్‌కు దీటుగా అందుబాటులోకి తేనుంద‌ని తెలిసింది. ఈ క్రమంలోనే ఓ టీం కొత్త ఓఎస్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నద‌ని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ 4వేల మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఈ ఓఎస్ తయారి కోసం ఏర్పాటు చేసింద‌ని స‌మాచారం. ఇక నూతనంగా రాబోతున్న ఆ కొత్త ఓఎస్ అగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌), వ‌ర్చువ‌ల్ రియాలిటీ (వీఆర్‌) హార్డ్‌వేర్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) కు సపోర్ట్‌నిచ్చేలా ఉంటుంద‌ని తెలిపింది. ఇప్పటికే ప్రైవ‌సీ, డేటా చౌర్యం విషయాల‌పై ఫేస్‌బుక్ అనేక సార్లు ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నది. దీని దృష్ట్యా కొత్తగా తీసుకువ‌చ్చే ఓఎస్‌ను యూజ‌ర్లు ఏ విధంగా ఆద‌రిస్తారో అన్న విషయాన్ని ముందు ముందు తెలుసుకోవాల్సిందే. అయితే మొబైల్ ఓఎస్ మార్కెట్ షేర్‌లో ఆండ్రాయిడ్ ఇప్పటికే 87 శాతానికి పైగా వాటా క‌లిగి ఉన్నందున ఫేస్‌బుక్ తీసుకువ‌చ్చే ఓఎస్ ఎలా ప్రభావం చూపిస్తుంద‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఉత్కంఠకు తెరదించాలంటే వేచి చూడక తప్పదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories