ఇక త్వరలో ఫేస్ బుక్ లో న్యూస్!

ఇక త్వరలో ఫేస్ బుక్ లో న్యూస్!
x
Highlights

ఫేస్ బుక్ లో త్వరలో వార్తా విశేషాలకు సంబంధించిన కొత్త ఫీచర్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. న్యూస్ పేరుతో ప్రత్యెక ఫీచర్ ను ప్రారంభించి.. నమంకమైన వార్తల్ని అందించేందుకు ఫేస్ బుక్ కసరత్తులు చేస్తోంది.

ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా ముస్తాబయ్యే ఫేస్ బుక్ ఫీచర్లకు త్వరలో ఓ కొత్త హంగు జత కాబోతోంది. ఇప్పటి వరకూ కేవలం యూజర్లు తమ అభిప్రాయాలని పంచుకోవడం మీదే ఎక్కువగా ఫేస్ బుక్ ఫోకస్ ఉండేది. కానీ, త్వరలో వార్తల్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది ఫేస్ బుక్. ప్రత్యేకంగా ఫేస్ బుక్ పేజీలో న్యూస్ అనే ఫీచర్ ను ఏర్పాటు చేయబోతోంది. న్యూస్ ఫీడ్, మెసెంజర్, వాచ్ అనే ఫీచర్లు ఇప్పటివరకూ ఫేస్ బుక్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా న్యూస్ ను జత చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది ఫేస్ బుక్.

గత ఏప్రిల్ లో ఈ విషయాన్ని జుకర్ బర్గ్ ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశలో ఏర్పాట్లు వేగవంతం చేశారు. అన్నీపూర్తి చేసి వచ్చే జనవరిలో ఈ ఫీచర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది ఫేస్ బుక్. ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికాలోని టాప్ న్యూస్ సంస్థల్ని ఫేస్ బుక్ సంప్రదించిందని తెలుస్తోంది. లైసెన్సుల కోసం ఆ సంస్థలకు దాదాపు 3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి కూడా ఫేస్ బుక్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. న్యూస్ ఫీచర్ కోసం సొమ్ము ఖర్చు చేస్తున్నాప్పటికీ, వినియోగదారులకు మాత్రం వార్తల్ని ఉచితంగానే అందించనుంది ఫేస్ బుక్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories