Lotus Tower: కొలంబో 'లోటస్‌ టవర్‌' ప్రారంభానికి సర్వం సిద్ధం.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

Everything is Ready for the Opening of the Colombo Lotus Tower
x

Lotus Tower: కొలంబో ‘లోటస్‌ టవర్‌’ ప్రారంభానికి సర్వం సిద్ధం.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

Highlights

Lotus Tower: ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతి

Lotus Tower: ద్వీప దేశం శ్రీలంకలో అద్భుత కట్టడాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిన ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తైంది. చైనా రుణంతో నిధులు సమకూర్చుకొని దాదాపు పదేళ్ల పాటు నిర్మించిన ఈ 'కొలంబో లోటస్‌ టవర్‌' ఈ వారంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1150 అడుగులు, 350 మీటర్ల ఎత్తు కలిగిన ఈ భారీ టవర్‌ అబ్జర్వేషన్ డెక్‌.. ఇవాళ్టి నుంచి సందర్శకులకు తెరిచే ఉంటుందని ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొలంబో లోటస్‌ టవర్‌ యాజమాన్యం సంస్థ వెల్లడించింది. ఈ భవనంలోని ఆఫీస్‌, షాపింగ్‌ స్థలాన్ని అద్దెకు ఇవ్వనున్నారు. ఈ టవర్‌ నుంచి రద్దీగా ఉండే రాజధాని కొలంబో నగరంతో పాటు హిందూ మహా సముద్రాన్ని వీక్షించవచ్చు. తామర పువ్వు నమూనాలో ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు. ఆసియాలో ఉన్న ఎత్తయిన టవర్లలో 11వది కాగా.. ప్రపంచంలో 19వ ఎత్తయిన టవర్‌ ఇది.

Show Full Article
Print Article
Next Story
More Stories