Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు అంతా రెడీ

Queen Elizabeth II: లండన్ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Jyothi
Updated on: 19 Sept 2022 9:30 AM IST
Everything is Ready for the Funeral of Queen Elizabeth II of Britain
X

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు అంతా రెడీ

Queen Elizabeth II: దివంగత బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రాణి అంత్యక్రియలు జరిపేందుకు ఆ దేశం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎలిజబెత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మన రాష్ర్టపతి ద్రౌపది ముర్ముతో సహా 500 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు బ్రిటన్ వెళ్లారు. రాష్ర్టపతి ముర్ము అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు.

తమ ప్రియతమ రాణిని కడసారి చూసేందుకు తీవ్రమైన చలిలోనూ బ్రిటన్ వాసులు బారులు తీరి ఉన్నారు. రాణికి మరణానికి సంతాపంగా దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలను 70 ఏళ్ల సుదీర్ఘ కాల పాలించిన 96 ఏళ్ల రెండో ఎలిజబెత్ రాణి ఈనెల 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

Jyothi

Jyothi

Next Story