Elon Musk: అమెరికాలో మూడో పార్టీ రానుందా? ఎలాన్ మస్క్ పోస్ట్ వైరల్

Elon Musk: అమెరికాలో మూడో పార్టీ రానుందా? ఎలాన్ మస్క్ పోస్ట్ వైరల్
x
Highlights

Elon Musk: అమెరికాలో ఇప్పటివరకు రెండు పార్టీలే పాపులర్. మరి ఇప్పుడు మూడో పార్టీ రానుందా? బిలియనీర్, ట్విటర్ సీఈవో పెట్టిన పోస్ట్ చూస్తే అదే అనిపిస్తుంది.

Elon Musk: అమెరికాలో ఇప్పటివరకు రెండు పార్టీలే పాపులర్. మరి ఇప్పుడు మూడో పార్టీ రానుందా? బిలియనీర్, ట్విటర్ సీఈవో పెట్టిన పోస్ట్ చూస్తే అదే అనిపిస్తుంది. అమెరికాలో మరోపార్టీ కావాలా వద్దా? అని మస్క్ ఒపీనియన్ పోల్ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కాక రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మస్క్ అమెరికాలో కొత్త పార్టీ పెట్టి, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాడా? ఏంటి? అని ఆలోచనలో పడ్డారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్.. ఎప్పుడూ ఏదో ఒక వైరల్ న్యూస్‌లో ఉంటూనే ఉంటారు. తాజాగా అమెరికాలో మరోపార్టీ కావాలా వద్దా? అని తన ట్విటర్‌‌లో ఒక ఒపీనియన్ పోల్ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు. ఈ పోస్ట్ ఇప్పుడు ఏకంగా అమెరికా రాజకీయాలనే మార్చబోతుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని గెలిపించిన ఘనత ఎలాన్ మస్క్‌ది. అయితే ఇప్పుడు ఆయన సీట్‌కే ఎలాన్ మస్క్ ఎసరు పెడుతున్నారా? ట్రంప్‌ని గద్దె దించేసి మరోపార్టీ పెట్టి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు అమెరికా రాజకీయనేతల్లో ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇంతకీ దీనికి కారణం ఏంటి అంటే..తాజా మస్క్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టడమే.

ఇప్పటివకు అమెరికా రాజకీయంలో రెండు పార్టీలదే పై చేయి. అవి డెమొక్రటిక్, రిపబ్లిక్. ఎప్పుడూ ఈ రెండు పార్టీలకు చెందిన వారు మాత్రమే ఆ దేశానికి ప్రెసిడెంట్లు అవుతారు. ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరు యుద్ధం నడుస్తుంది. అటువంటిది ఇప్పుడు మస్క్ మూడో పార్టీ మీకు కావాలా...అని నెటిజన్లను అడగడంతో అది సంచలనంగా మారింది.

దీనిపై స్పదించిన ఒక యూజర్.. అమెరికాలో ఇప్పటివరకు థర్డ్ పార్టీ రాలేదు. వచ్చినా రిపబ్లిక్, డెమొక్రటిక్ మధ్య అది నిలబడలేదు. ఒకవేళ ఎలాన్ మస్క్ మూడో పార్టీ పెట్టినా అదే జరుగుతుంది. కానీ .. మస్క్‌ తెలివైన వాడు. కాబట్టి ఆ పార్టీ విజయం సాధించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ నిజంగా మస్క్ వస్తే.. అమెరికాలోని రాజకీయ ఆటను పూర్తిగా మారుస్తుంది..అని పెట్టడం కూడా సెన్సేషన్ అయింది.

ఇదిలా ఉంటే అసలు ఇప్పుడు ఎలాన్ మస్క్ ఈ పోస్ట్ పెట్టడం వెనుకు ఉన్న కారణం ఏంటనే ఆలోచిస్తే.. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లే కారణం మని రాజకీయ వేత్తలు అంటున్నారు. ఈ బిల్‌లో వలసదారుల బహిష్కరణ ప్రచారానికి భారీ బడ్జెట్ ఉంది. దీని కారణంగా ఆర్ధిక వ్యయానికి సంబంధించిన ప్రణాళికలు రాబోయే 10ఏళ్లలో లోటును $ 3.3 ట్రిలియన్లు పెంచుతామని మస్క్ భావిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ మస్క్ మద్య విభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మస్క్ ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉంటారనే రాజకీయవేత్తలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories