Elon Musk 14th Child: 14వ సారి... మరోసారి తండ్రైన మస్క్ మావా

Elon Musk 14th Child:  14వ సారి... మరోసారి తండ్రైన మస్క్ మావా
x
Highlights

Elon Musk 14th Child: ప్రపంచంలో కుబేరుడు..వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ మరోసారి బిడ్డకు తండ్రయ్యాడు. తన సహజీవన భాగస్వామి షివోన్ జిలిన్ మరోసారి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఈ బిడ్డ గురించి శివోన్ గిల్లిస్ స్వయంగా X లో ప్రకటించారు.

Elon Musk 14th Child: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన సహజీవన భాగస్వామి న్యూరోలింగ్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. మస్క్ తో మాట్లాడాను. మా కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ గురించి ప్రపంచానికి స్వయంగా తెలిపాలని నిర్ణయించుకున్నామని షివోస్ రాసుకొచ్చారు. తమ మూడో బిడ్డ ఆర్కాడియా పుట్టినరోజు సందర్టబంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్టుకు హార్ట్ సింబల్ తో మస్క్ రిప్లే కూడా ఇచ్చారు.

ఇప్పటి వరకు మస్క్ కు 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మరణించింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటన్ నటి తాలులూహ్ రిలేను మస్క్ వివాహం చేసుకున్నారు. అయితే వారికి సంతానం కలగలేదు. అనంతరం కెనెడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం నడిపారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత తన ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్ జిలిస్ తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా..తాజాగా ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది.

ఇదెలా ఉండగా ఇటీవల తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ రచయిత్రి ఆష్టీ సెయింట్ క్లెయిర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఐదు నెలల క్రితమే తానో బిడ్డకు జన్మనిచ్చానని అయితే గోప్యత, భద్రతా కారణాల వల్ల ఈ విషయం బహిర్గతం చేయలేదని తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు మస్క్ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ బిడ్డకు కూడా మస్క్ తండ్రి అని తేలితే ఇప్పటి వరకు ఆయనకు 14 మంది సంతానం ఉన్నట్లు అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories