America Party: ఎలాన్ మస్క్ రాజకీయాల్లోకి ఎంట్రీ: 'అమెరికా పార్టీ' ఏర్పాటు ప్రకటన

America Party
x

America Party: ఎలాన్ మస్క్ రాజకీయాల్లోకి ఎంట్రీ: 'అమెరికా పార్టీ' ఏర్పాటు ప్రకటన

Highlights

America Party: అంతర్జాతీయ స్థాయిలో టెస్లా అధినేతగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ద్విపక్ష రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇస్తాం" అనే నినాదంతో 'అమెరికా పార్టీ' పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు.

America Party: అంతర్జాతీయ స్థాయిలో టెస్లా అధినేతగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ద్విపక్ష రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇస్తాం" అనే నినాదంతో 'అమెరికా పార్టీ' పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు.

మస్క్ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) లో నిర్వహించిన ఓపీనియన్ పోల్‌లో ప్రజల నుంచి బలమైన మద్దతు లభించిందని వెల్లడించారు. ‘‘ప్రతి ముగ్గురిలో ఇద్దరు కొత్త పార్టీ కావాలంటున్నారు. మీ కోరికే ఇప్పుడు నిజం కాబోతుంది’’ అని ట్వీట్ చేశారు.



2026 మధ్యంతర ఎన్నికల లక్ష్యం

అమెరికా పార్టీ తొలి దశలో 2026లో జరిగే మధ్యంతర (మిడ్‌టెర్మ్) ఎన్నికలపై దృష్టి సారించనుంది. మస్క్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్థానాల్లో పోటీ చేస్తారని తెలిపారు. ముఖ్యమైన చట్టాల విషయంలో పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ట్రంప్ ‘బిగ్ బిల్’పై తీవ్ర విమర్శ

ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద ‘బిగ్ బిల్’పై మస్క్ తీవ్రంగా స్పందించారు. బిల్లులో విచ్చలవిడి ఖర్చులు ఉన్నాయని విమర్శిస్తూ, దేశాన్ని ఒకే పార్టీ పాలిస్తున్నదని, దాన్ని ‘పోర్కీ పిగ్ పార్టీ’గా అభివర్ణించారు. గతంలో ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉండి, DOGE (గవర్నమెంట్ డిజిటల్ సామర్థ్య విభాగం)కు సలహాదారుగా సేవలందించిన మస్క్ ఇప్పుడు ఆయనను విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అధికారిక నమోదు లేదు – సవాళ్లూ అధికమే

అయితే, ఈ పార్టీని ఇప్పటి వరకు ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ (FEC) వద్ద అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీ స్థాపన ఓ కఠినమైన ప్రక్రియ. ప్రతీస్టేటులో నిబంధనలు కఠినంగా ఉండటంతో పాటు, లక్షలాది సంతకాల సేకరణ వంటి ప్రక్రియలు కూడా తప్పనిసరి.

ఎలాన్ మస్క్‌కు అపారమైన ఆర్థిక వనరులు ఉన్నా, అమెరికాలో బలమైన రెండు పార్టీల రాజకీయ వ్యవస్థలో మూడో పార్టీలు సాధారణంగా ఓట్లను చీల్చడానికే పరిమితమవుతాయని, గెలుపు సాధించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది డువర్జర్ సిద్ధాంతంగా పరిగణించబడుతుంది.

మస్క్ రాజకీయ ప్రయోగం ఎంతవరకు సఫలం...?

మస్క్ రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుతం ఆసక్తికర దశలో ఉంది. సంపద, సోషల్ మీడియా ప్రభావం, ప్రజల్లో ఆదరణ ఉన్నా – ఆయ‌న ప్రతిష్టను ఎన్నికల ఫలితాల్లోకి ఎలా మార్చుకుంటారన్నది వేచి చూడాల్సిన విషయం. రాజకీయ రంగంలో మస్క్ వేసిన ఈ అడుగు అమెరికా రాజకీయ చరిత్రలో కీలక మలుపు అవుతుందా? లేక ఇది మరో సాహసోపేత ప్రయత్నంగానే మిగిలిపోతుందా? అన్నది కాలమే నిర్ణయించాల్సినది.

Show Full Article
Print Article
Next Story
More Stories