logo
ప్రపంచం

ఎలాన్‌ మస్క్‌, గ్రిమ్స్‌ దంపతులకు మరో సంతానం.. సరోగసి పద్ధతిలో.. విచిత్రమైన పేరు...

Elon Musk and Grimes gave Birth to Second Baby by Surrogacy | Trending News
X

ఎలాన్‌ మస్క్‌, గ్రిమ్స్‌ దంపతులకు మరో సంతానం.. సరోగసి పద్ధతిలో.. విచిత్రమైన పేరు...

Highlights

Elon Musk - Grimes: కొడుకు పేరు కంటే పాప పేరు నయమంటున్న నెటిజన్లు...

Elon Musk - Grimes: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఏం చేసినా.. సంచలనమే.. తాజాగా ఎలాన్‌ మాస్క‌, గ్రిమ్స్‌కు రెండో సంతానంగా పాప పుట్టింది. వారిద్దరి మొదటి సంతానమైన కుమారుడికి విచిత్రమైన పేరు పెట్టినట్టే.. కూతురికి కూడా అలాంటి పేరునే పెట్టారు. సరోగసి పద్ధతిలో గత డిసెంబరులోనే ఈ పాప పుట్టినా.. ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. తాజాగా ఆ పాపకు ఎక్సా డార్క్‌ సైడరాయెల్‌ మస్క్‌గా నామకరణం చేశారు. అంతేకాదు.. ఆ పాపను మస్క్‌ దంపతులు ముద్దుగా 'వై' అని పిలుస్తారట..

పాప పేరు తెలిసిన సోషల్‌ మీడియాలో ఈ విషయమై జోరుగా చర్చ జరుగుతోంది. ఎలాన్‌ మస్క్‌, గ్రిమ్స్‌ కుమారుడి పేరును ఏఎక్స్ ఏఈఏ -12 మ‌స్క్. అదేదో చూస్తే.. పాస్‌వర్డ్‌లా అనిపిస్తున్నా.. దీనిపై సోషల్‌ మీడియాపై జోరుగా అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా ఏఎక్స్ ఏఈఏ -12 మ‌స్క్ పేరు కంటే.. ఎక్సా డార్క్‌ సైడరాల్‌ మస్క్ పేరు పలకడానికి ఎంతో నయమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కుమారుడి పేరును ముద్దుగా ఎక్స్‌ అని పిలుచుకునే మస్క్‌ దంపతులు.. కూతురిని ముద్దుగా వై అని పిలుచుకోవడంపైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంగ్లీష్‌ అల్ఫా బెట్లలో ఎక్స్‌ తరువాత వచ్చేది వై.. కదా.. అని అందుకే అలా పిలుస్తున్నారేమో అంటూ చర్చించుకుంటున్నారు.


Web TitleElon Musk and Grimes gave Birth to Second Baby by Surrogacy | Trending News
Next Story