UK Prime Minister: బ్రిటన్‌ ప్రధాని రేసులో 8 మంది అభ్యర్థులు

Eight Candidates Qualify in Race to Be Next UK Prime Minister
x

UK Prime Minister: బ్రిటన్‌ ప్రధాని రేసులో 8 మంది అభ్యర్థులు

Highlights

UK Prime Minister: సెప్టెంబరు 5న ప్రధాని ఫలితాలు

UK Prime Minister: బ్రిటన్‌ అత్యున్నత పదవి ప్రధాని పీఠం, కన్జర్వేటివ్‌ పార్టీ నేత రేసులో చివరికి 8 మంది ఎంపీలు మిగిలారు. ఆమేరకు తాజాగా కన్జర్వేటివ్‌ పార్టీ ప్రకటించింది. ప్రధాని పదవికి పోటీ పడే ఎంపీ కనీసం 8 మంది నుంచి 20 మంది లోపు ఎంపీల మద్దతు పలకాల్సి ఉంటుంది. మాజీ అర్థిక శాఖ మంత్రి రిషి సునక్‌, నదీమ్‌ జాహవి, విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌, మాజీ రక్షణ శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్‌, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి జెరమీ హంట్‌లకు ఆమేరకు 20 మంది ఎంపీల చొప్పున మద్దతు పొందారు. ఇప్పటికే కెమి బాదెనోచ్‌, సుయెల్లా బ్రేవర్‌మన్‌, టామ్‌ టుజెందాట్ పోటీలో ఉన్నారు. దీంతో మొత్తం ప్రధాని రేసుకు మొత్తం 8 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇవాళ జరిగే మొదటివిడత ఓటింగ్‌లో 8 మంది అభ్యర్థుల్లో ఒకరు ప్రధాని రేసు పోటీ నుంచి నిష్క్రమించనున్నారు.

బోరిస్‌ జాన్సన్‌ కుంభకోణాలపై నిరసనగా ఆర్థిక శాఖకు రిషి సునక్‌, ఆరోగ్య శాఖకు సాజిద్‌ జావేద్‌ రాజీనామా చేసి బ్రిటన్‌ రాజకీయాల్లో అలజడిని సృష్టించారు. ఆ తరువాత రాజీనామాల పర్వం ప్రారంభమైంది. సుమారు 50 మంది మేర మంత్రి పదవులు, ఇతర పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో బోరిస్‌పై ఒత్తిడి పెరిగింది గత్యంతరంలేక ప్రధాని పదవికి జాన్సన్‌ రాజనామా చేశారు. ఆ తరువాత రిషి సుకన్‌తో పాటు సాజిద్‌ జావేద్‌ కూడా ప్రధాని పదవికి పోటీ పడ్డారు. అయితే సాజిద్‌ జావెద్‌కు ప్రధాని అభ్యర్థికి వసరమైన మద్దతు లభించలేదు. దీంతో ఆయన రేసు నుంచి తొలగిపోయారు. రిషి సునక్‌ మాత్రం పోటీలో ముందుకు సాగుతున్నారు. బోరిస్‌ పదవిని కోల్పోవడానికి రిషి సునకే కారణం. ఇప్పటికే రెడీ ఫర్ రిషి పేరిట తన ప్రచారాన్ని కూడా రిషి సునక్‌ ప్రారంభించారు.

2020లో బ్రిటన్‌ ఖజానాకు చాన్సలర్‌గా నియమితులైన రిషి సునక్‌.. కోవిడ్‌ మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికులకు మద్దతుగా నిలిచి మంచి పేరు సంపాదించారు. తాను కలిసిన మంచి వ్యక్తుల్లో బోరిస్‌ జాన్సన్ ఒకరని రిసి సునక్‌ కొనియాడారు. జాన్సన్‌కు మంచి మనస్సున్న వ్యక్తన్నాడు. బోరిస్‌పై ఎలాంటి విమర్శలకు దిగబోనని తాజాగా రిషి ప్రకటించారు. మహమ్మారి సమయంలో బోరిస్ చేసిన కృషి, ఉక్రెయిన్‌ యుద్ధంలో మద్దతుగా నిలవడంలో ప్రధానిగా ఎంతో శ్రమించారని కితాబిచ్చారు. ప్రధాని రేసులో రిషి ముందువరుసలో ఉన్నారు. ఓటింగ్‌లో రిషి గెలిస్తే మాత్రం బ్రిటన్‌ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించే తొలి హిందువు, భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఆయనే అవుతారు. ప్రధానమంత్రి అభ్యర్థి ఓటింగ్‌ ఇవాలిటి నుంచి ప్రారంభం కానున్నది. సెప్టెబరు 5న తుది ఫలితాలను వెల్లడించి ప్రధాని పేరును ప్రకటించనున్నారు. అప్పటివరకు బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా కొనసాగనున్నారు. అయితే ప్రధాని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories