ఆర్థిక మాంద్యం.. కండోమ్స్ కీ తాకిన సెగ!

ఆర్థిక మాంద్యం.. కండోమ్స్ కీ తాకిన సెగ!
x
Highlights

ఆర్థిక మాద్యానికీ.. కండోమ్స్ కీ కనెక్షన్ ఏమిటనుకుంటున్నారా? నిజమైన ఆర్ధిక మాంద్యం సృష్టించే ఇబ్బందులు ఎలా ఉంటాయో దానికి ఉదాహరనే ఇది. అదెలాగో, ఏమిటో ఈ కథనం చదివితే తెలుస్తుంది.

ఆర్థిక మాద్యానికీ.. కండోమ్స్ కీ కనెక్షన్ ఏమిటనుకుంటున్నారా? నిజమైన ఆర్ధిక మాంద్యం సృష్టించే ఇబ్బందులు ఎలా ఉంటాయో దానికి ఉదాహరనే ఇది. అదెలాగో, ఏమిటో ఈ కథనం చదివితే తెలుస్తుంది. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా లో కండోమ్స్ వాడకం చాలా అధికంగా ఉంటుంది. అక్కడ ప్రజలు కండోం లేకుండా సెక్స్ లో పాల్గోవడం జరగదు. దక్షిణ అమెరికాలోని రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అర్జెంటీనా దే. అయితే, ప్రస్తుతం అర్జెంటీనాలో తీవ్ర ఆర్ధికమాంద్యం నెలకొని ఉంది. అక్కడ డాలర్ తో పోలేస్తే అర్జెంటీనా కరెన్సీ 'పేసో' విలువ భారీగా పడిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో ఎ వస్తువూ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో కండోం కూడా నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా ఉంటుంది. దానితొ వీటి ధరలు ఏకంగా 36 శాతం పెరిగిపోయాయి. ఈ దెబ్బకి కండోంల అమ్మకాలు 8 శాతం మేరకు పడిపోయాయి. ఇది అక్కడి ఆర్ధిక మాంద్యం దుస్థితికి అడ్డం పడుతోంది.

ఇక కండోంల తయారీలో వాడే ముడి సరుకులు అర్జెంటీనా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాటి ధరలు బాగా పెరిగిపోయాయి. అంతేకాకుండా, పేసో విలువ దారుణంగా పడిపోవడంతొ కండోం ధరలు విపరీతంగా పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది స్తారంభం నుంచి వీటి ధర 36 శాతం పెరిగిందని కండోమ్‌ తయారీ సంస్థలైన తులిపాన్‌, జెంటిల్‌మన్‌ అధ్యక్షుడు ఫెలిపె కొపెలోవిక్ట్‌ వెల్లడించారు. గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు కూడా 6 శాతం పడిపోయాయని ఫార్మాసిస్టులు చెబుతున్నారు. అర్జెంటీనా ఫార్మాస్యూటికల్‌ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షురాలు ఇసబెల్‌ రెనోసో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ... నెలకు దాదాపు 1.44 లక్షల మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడడం మానేశారని చెప్పారు. ఈ పరిస్థితిపై అర్జెంటీనాలోని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కండోమ్‌లు లేకుండా లైంగిక చర్యలకు ఉపక్రమిస్తే సుఖ వ్యాధులు ప్రబలే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఉచితంగా కండోమ్‌లు పంపిణీ చేయాలని ఓ హెచ్‌ఐవీ వ్యతిరేక ఉద్యమ సంస్థలో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ అయిన మార్‌ లుకాన్‌ కోరారు. ఈ విషయాన్ని రాయిటర్స్‌ అర్జెంటీనా వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించేందుకు నిరాకరించారు.

ఇక అర్జెంటీనాలో ప్రముఖ నటుడైన గిల్లెర్మో అక్వినో ఓ వీడియోలో మాట్లాడుతూ... పెసో విలువ దిగజారిపోవడం నన్ను బాధిస్తోంది. కనీసం నా భాగస్వామిని కూడా సుఖపెట్టలేకపోతున్నాను. నా దగ్గర ఒకే ఒక కండోమ్‌ మిగిలింది. ఇదంతా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వల్లే తలెత్తింది" అని ఓ వీడియోలో అన్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అయింది. ఈ వీడియో ఆర్ధిక మాంద్యం వల్ల వచ్చే ఇబ్బందులకు సాక్ష్యంగా నిలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories