ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు : న్యూజిలాండ్ లో భూకంపం

ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు : న్యూజిలాండ్ లో భూకంపం
x
Highlights

ప్రపంచాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన సత్తా చూపించి, ప్రజా వ్యవస్థనే తారుమారు చేయగా,...

ప్రపంచాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన సత్తా చూపించి, ప్రజా వ్యవస్థనే తారుమారు చేయగా, తాజాగా ఇటీవల కాలంలో తుఫానులు, భూ కంపాలు వెంటాడుతున్నాయి. ఈ భూకంపం నెల రోజుల వ్యవధిలోనే రెండు, మూడు సార్లు వచ్చి జన జీవనాన్ని స్థంబింపచేయడమే కాదు అధికంగా ఆస్తి నష్టాన్ని కలుగ జేస్తున్నాయి.

ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు మరింత భయపెడుతున్నాయి. తాజాగా.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 7.1గా నమోదైందని సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. కెర్మాడెక్ దీవు దక్షిణ ప్రాంతంలో భూమి కంపించిందని పేర్కొంది. దీవిలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం ఉంది.

ఈ భూ ప్రకంపనలతో న్యూజిలాండ్‌లోని ఒపొటికి, వాటాఖనే, గిస్బోర్న్, తౌరంగ, రొటొర్గాపై కూడా ఈ ప్రభావం కనించిందని ఓ మీడియా సంస్థ ప్రకటించింది. భూ ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. భూ ప్రకంపనలు అధికంగా ఉన్నప్పటకీ.. సునామీ వచ్చే అవకాశం లేదంటున్నారు అమెరికా జియలాజిస్టులు. కానీ అమెరికా జియలాజిస్టులు మాత్రం భూంకప తీవ్రత 7.4గా ఉంది అని రిపోర్ట్ చేశాయి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories