కరేబియన్ తీరంలో భూకంపం.. సునామి హెచ్చరిక..

కరేబియన్ తీరంలో భూకంపం.. సునామి హెచ్చరిక..
x
Highlights

కరేబియన్ తీరంలోని జమైకా మరియు తూర్పు క్యూబా దేశాల మధ్య నిన్న అర్ధరాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది.

కరేబియన్ తీరంలోని జమైకా మరియు తూర్పు క్యూబా దేశాల మధ్య నిన్న అర్ధరాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌లో 7.7 గా నమోదయింది. మెక్సికో నుండి ఫ్లోరిడా వరకు కరేబియన్ దీవులతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలలో భూకంపం ప్రభావం కనిపించిందని.. భవనాలు ఒక్కసారిగా కదలడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు వీధుల్లోకి పరుగెత్తారని అధికారులు దృవీకరించారు. ఈ భూకంపం తీరప్రాంత పట్టణం మరియు హనోవర్ పారిష్ రాజధాని లూసియాకు వాయువ్య దిశలో సంభవించిందని తెలిపారు. భూకంపం కారణంగా భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లింది.

అయితే పెద్దగా ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ భూకంపం దాటికి క్యూబా, జమైకా మరియు కేమాన్ దీవులలో సునామీ హెచ్చరిక జారీ అయింది. తీరం మరియు లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు అధికారులు. అంతేకాదు దీవులలో నివసించే తీరా ప్రాంతల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సహాయం కోసం అక్కడ హెలికాఫ్టర్లు, ఇతర వాహనాలను అందుబాటులో ఉంచింది. భూకంపం నేపథ్యంలో ప్రత్యేక భద్రతా విభాగం కూడా సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలియజేశారు . ప్రాణనష్టం లేకపోయినా స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్టు తాము గుర్తించినట్టు వెల్లడించారు. కాగా ఈ భూకంపం ప్రభావంతో సునామీ ముప్పు పొంచి ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా స్పష్టం చేసింది.

యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం క్యూబా, జమైకా మరియు కేమాన్ దీవుల తోపాటు హోండురాస్, మెక్సికో తీరాలకు సుమారు 0.3 నుండి ఒక మీటర్ వరకు లేదా టైడ్ లెవెల్.. ఒకటి నుండి మూడు అడుగుల ఎత్తుకు చేరుకునే సునామీ తరంగాల ముప్పు పొంచి ఉందని హెచ్చరిక జారీ చేసింది. మయామి భవనాలు కదలడంతో దూరంలో ఉన్న ప్రాంతాలకు సమాచారం అందింది. దాంతో క్యూబాలో ఎత్తైన భవనాలలో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులు ఖాళీ చేశారని తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories