Top
logo

సీహార్స్‌ విల్లాస్‌ చూశారా... అలా దుబాయ్‌ వెళ్లొద్దాం రండి!

సీహార్స్‌ విల్లాస్‌ చూశారా... అలా దుబాయ్‌ వెళ్లొద్దాం రండి!
X
Highlights

దుబాయ్ లో నిర్మాణ రంగంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అక్కడ మానవ నివాసిత దీవుల్లో సముద్రంలో తెలియాడుతున్నట్టుగా ఉండే సీహార్స్ విల్లాలు రూపుదిద్దుకుంటున్నాయి.

అందమైన భవంతులు... ఆపై చుట్టూ అందమైన జలపాతాలు. మధ్యమధ్యలో సముద్రం గర్జనలు. అలాంటి అద్భుతమైన దృశ్యాలకు వేదిక కానుంది దుబాయ్‌. ఇప్పటికే ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న దుబాయ్‌... సీహార్స్‌ విల్లాస్‌తో మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దుబాయి తీరప్రాంతంలో మానవ నిర్మిత దీవుల్లో తేలియాడే సీ హార్స్ విల్లాలు సిద్ధం అవుతున్నాయ్. సముద్ర ఉపరితలంతో పాటు అంతర్భాగంలో కూడా గదులు ఉండటం ఫ్లోటింగ్ సీ హార్స్ విల్లాల ప్రత్యేకత. సముద్రం లోపల ఉన్నా.. దృఢమైన అద్దాల సహాయంతో ఎలాంటి ప్రమాదం లేకుండానే ఇంట్లోనే ఉన్న అనుభూతి కలుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న పరికరాలు ఆ విల్లాలో ఉండటంతో ఒక దీవిలో ఉన్నామనే ఆలోచనే రాదు.

ఒక్కో విల్లా 4000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్నారు. హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ టీవీ, ఏసీ, స్విమ్మింగ్ పూల్స్‌తో పాటు మరెన్నో సౌకర్యాలు ఫ్లోటింగ్ సీ హార్స్ ప్రత్యేకతలు. రిక్వెస్ట్ మీద పర్సనల్ చెఫ్‌ను కూడా పెట్టుకునే అవకాశం ఉంది. యూరోపియన్ ఆర్కిటెక్టులు వీటికి డిజైన్ చేశారు. 2019 చివరికల్లా మొత్తం 125 ఫ్లోటింగ్ సీ హార్స్ విల్లాలను దుబాయి తీర ప్రాంతాల్లో నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు.

Next Story