
మందుబాబుల చిందులు చూడటానికి నవ్వుపుట్టిస్తాయి. కొన్నైతే భయాన్ని కూడా కలిగిస్తాయి. వారేం చేస్తున్నారో వారికి అర్థం అవుతుందో లేదో కానీ, వారు చేసే పనులకు...
మందుబాబుల చిందులు చూడటానికి నవ్వుపుట్టిస్తాయి. కొన్నైతే భయాన్ని కూడా కలిగిస్తాయి. వారేం చేస్తున్నారో వారికి అర్థం అవుతుందో లేదో కానీ, వారు చేసే పనులకు మాత్రం ఒక్కోసారి మనకు ముచ్చెమటలు పడుతాయి. తప్ప తాగి కొంపలో గమ్మున కూచోకుండా రోడ్లెక్కే వారితో వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి తాగుబోతు చేసిన ఓ విచిత్రమే ఇది.
గ్రేటర్ మాంచెస్టర్ లో తాగుబోతు చేసిన హడావుడికి పోలీసులకు మతి పోయింది. మనోడు ఫుల్లుగా మందేసి.. ఆపైన కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ రయ్యి..రయ్యిన రోడ్డుమీద వెళ్ళిపోతున్నాడు. రొటీన్ గానే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ లు చేస్తున్నారు. వారు ఈ మందుబాబును ఆపారు. కారు దింపారు. మనోడికి సోయి ఉంటేగా.. ఇక కారును పరిశీలించిన పోలీసులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇంతకీ ఏమైందంటే, ఆ కారుకు ముందు వైపు ఉండాల్సిన రెండు టైర్లూ లేవు. కేవలం డిస్క్ లు మాత్రమే ఉన్నాయి. మన మందుబాబుకి ఆ విషయం కూడా తెలీలేదు అంటే, ఎంతగా కిక్కులో ఉన్నడో చూడండి.
దాంతో మనోడు ఎంత తాగివున్నదో చూద్దామని బాబూ ఊదరా అన్నారు. జస్ట్ 196 రీడింగ్ చూపించింది అది. దాంతో సదరు మందువాలా ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీసులు ఈ విషయాన్ని ఫొటోతో సహా తమ ట్విట్టర్ లో ఉంచారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ తాగుబోతును తిడుతూ..పోలీసులు మంచి పని చేశారని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Male been detained for drink drive on the M66 - has blown 196 (YES THATS 196!!) at the roadside- as you can see from the photos you can see why it came to our notice @GMPtraffic #unbelievable #neednewwheels pic.twitter.com/xfL4vutEo0
— North West Motorway Police (@NWmwaypolice) January 1, 2020

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire