తైవాన్‌లో నాటకీయ పరిణామాలు.. అధికార పార్టీకి ఘోర పరాభవం

* స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన చైనా మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ

R Tripura Malini
Published on: 27 Nov 2022 12:45 PM IST
Dramatic consequences in Taiwan A big defeat for the ruling party
X

అధికార పార్టీకి ఘోర పరాభవం

Taiwan: తైవాన్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story