ట్రంప్ చేసిన ప్రకటనను కవర్ చేసేందుకు కిందామీద పడుతున్న ప్రతినిధులు

ట్రంప్ చేసిన ప్రకటనను కవర్ చేసేందుకు కిందామీద పడుతున్న ప్రతినిధులు
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త ఇబ్బందులు తలెత్తాయి. అట్లాంటిక్ పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త ఇబ్బందులు తలెత్తాయి. అట్లాంటిక్ పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం - యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికులను ట్రంప్ లూజర్లుగా పేర్కొన్నారు. అంతేగాదు ట్రంప్ తనను తాను సాయుధ దళాల ఛాంపియన్‌గా అభివర్ణించుకున్నారు. సైన్యాన్ని బలోపేతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా, అమర సైనికులను అవమానపరిచేలా లూజర్ అనే పదాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ఇప్పుడు డెమొక్రాట్లు మరియు ఇతర ప్రత్యర్థుల చేతికి చిక్కారు.

ఈ విషయంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ కూడా ట్రంప్‌ను విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. 'నా కుమారుడు బియు బిడెన్ కూడా ఇరాక్‌లో ఉన్నాడు. అతను ఓడిపోలేదు. అతను బ్రెయిన్ క్యాన్సర్‌తో 2015 లో మరణించాడు. ఈ సమయంలో మీ కుమారుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది. మీరు ఒక కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్యను పోగొట్టుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది?' అని అన్నారు. ట్రంప్ ప్రకటనను అవమానకరమైన, అన్-అమెరికన్ మరియు బాధ్యత లేనిదిగా బిడెన్ అభివర్ణించాడు.

మరోవైపు, ట్రంప్ చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో నష్టా నివారణ చర్యలు చేపట్టారు. సైనికులను తానెప్పుడూ అవమానించలేదని అది నకిలీ ప్రకటన అని.. సైనికులు నిజమైన వీరులు అని అన్నారు. అయినా ట్రంప్ పై ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా ట్రంప్ ప్రకటనను కవర్ చేసేందుకు కిందా మీదా పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories