Donald Trump: 'నేను ఫేస్‌బుక్ లో ఫస్ట్, మోదీ సెకండ్'

Donald Trump: నేను ఫేస్‌బుక్ లో ఫస్ట్, మోదీ సెకండ్
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే భారత పర్యటన గురించి మాట్లాడటం ఆపడంలేదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే భారత పర్యటన గురించి మాట్లాడటం ఆపడంలేదు. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి "మిలియన్ల" మంది వస్తారని ఆయన ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఆట గురించి మాట్లాడుతున్నారుట్రంప్.. ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ తాను సోషల్ నెట్‌వర్క్‌లో "నంబర్ 1" అని - అలాగే ఇతరుల సంఖ్యను ప్రస్తావిస్తూ - మరియు ప్రధాని నరేంద్ర మోడీ రెండవ స్థానంలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు.

కానీ నిజానికి, ఇది ఖచ్చితంగా వ్యతిరేకం. ట్విప్లోమసీ యొక్క 2019 ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచ నాయకులలో ప్రథమ స్థానంలో ఉన్నది ప్రధాని మోదీ మోదీ.. ఫేస్బుక్లో ఆయనకు 44 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ తరువాత డోనాల్డ్ ట్రంప్ 26 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఇదంతా బరాక్ ఒబామాను లెక్కించకపోతే మాత్రమే ఆయన ప్రస్తుతం ప్రభుత్వ అధినేత కాదు.. అయినా కూడా ఒబామాకు 55 మిలియన్ల మంది ఫేస్బుక్ ఫాలోవర్లు ఉన్నారు.

కాగా అంతకుముందు భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. తన పర్యటన సందర్భంగా భారత్‌, అమెరికా ఒక వాణిజ్య ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్‌ ఈ నె 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కూడా వెళ్లనున్న ట్రంప్‌.. అక్కడ కొత్తగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మోదీ గొప్ప వ్యక్తి అని, భారత్‌కు వెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. భారత్‌తో సరైన ఒప్పందం చేసుకోగలిగితే.. తాను దానిపై సంతకం చేస్తానని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories