Donald Trump Impeachment: ట్రంప్‌కు షాక్.. అమెరికా చరిత్రలో రెండోసారి

Donald Trump Impeachment: ట్రంప్‌కు షాక్.. అమెరికా చరిత్రలో రెండోసారి
x

ట్రంప్ ఫైల్ ఫోటో 

Highlights

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్ మీద షాక్ తగులుతుంది. అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్‌...

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్ మీద షాక్ తగులుతుంది. అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచారు. ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని.. ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్‌నకు వ్యతిరేకంగా 232 ఓట్లు.. అనుకూలంగా 197 ఓట్లు పోలైయ్యాయి. అంతేకాదు పలువురు రిపబ్లికన్లు కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.

డెమొక్రాట్లు ప్రతినిధుల సభ పెట్టిన తీర్మానం అమోదం పొందింది. 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. డెమొక్రాట్లు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చ సాగింది. మెజార్టీ సభ్యులు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఓటేయడంతో అభిశంసనకు గురయ్యారు. ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది.

అమెరికా కాంగ్రెస్‌ సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో పోలీసులకు, ట్రంప్‌ మద్దతుదారులకు పెద్ద ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో ఐదుగురు మృతి చెందారు. ట్రంప్‌ కావాలనే తన వారిని రెచ్చగొట్టారని డెమొక్రాట్లు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పెట్టారు. మోజార్టీ సభ్యులు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాగా.. ఈ నెల 20 తేదీన అమెరికా కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్‌తో పాటు పలు సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ అకౌంట్లను తొలగించడమో తాత్కాలికంగా నిలిపివేయడమో చేయగా తాజాగా యూట్యూబ్ ట్రంప్ వ్యక్తిగత చానెల్‌ను నిలిపివేసింది. క్యాపిటల్‌ బిల్డింగ్ ‌పై దాడి అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయ‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఆ సంస్థ‌ బ్యాన్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories