నార్త్‌ కొరియా అధ్యక్షుడికి ముగ్గురు పిల్లలు.. కిమ్‌ కూతరంటూ వైరల్‌ అవుతున్న వీడియోలు

Does Kim Jong-un have a Secret Daughter?
x

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌కు కూతురు

Highlights

*తాజాగా ఓ కార్యక్రమంలో డాన్స్‌ చేసిన చిన్నారి

Kim Jong-un Secret Daughter: ఆధునిక నియంత ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేపేరు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఉత్తర కొరియా అధినేత కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. కిమ్‌ ఎక్కువగా ఒంటరిగానే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆయన కుటుంబానికి సంబంధించిన కనీసం ఫొటోలు కూడా కనిపించవు. కేవలం కిమ్ సోదరి కిమ్‌ యో జోంగ్‌, భార్య రిసోల్‌ జూకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు మాత్రమే సోషల్‌ మీడియా వేదికల్లో కనిపిస్తుంటాయి. తాజాగా ఉత్తర కొరియాలో నిర్వహించిన ఓ వేడుకలో ఓ చిన్నారి గురించి సోషల్‌ మీడియా హోరెత్తిస్తోంది. అందులో కనిపిస్తున్న బాలిక కిమ్‌ కూతురంటూ ప్రజారం జరుగుతుంది. అయితే ఆ చిన్నారే కిమ్‌ కూతురంటూ ఇప్పటివరకు ఎవరూ ధ్రవీకరించలేదు.

ఉత్తర కొరియా ఆవిర్భావ వేడుకల్లో చిన్నారులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వేడుకలు సెప్టెంబరు ప్రారంభంలో జరిగాయి. అయితే ఉత్తర కొరియా టీవీ చానల్‌లో వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. అయితే ఆ వేడుకల్లో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బాలిక పేరు జూ-ఇ అని.. కిమ్‌ కూతురంటూ సోషల్‌ మీడియన్లు హోరెత్తించారు. భారీగా చిన్నారి దృశ్యాలను షేర్‌ చేశారు. ఈ వేడుకల్లో కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో పాటు భార్య రి సోల్‌-జూ కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో కిమ్‌, భార్య ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. కిమ్‌ పిల్లలందరినీ దగ్గరకు తీసుకున్నారు. కిమ్‌ చుట్టూ చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఆయన భార్య రిసోల్‌-జూ కూడా ఇతర పిల్లలను పలకరించింది. కానీ ఆ చిన్నారి మాత్రం రిసోల్‌ తనకు బాగా పరిచయం ఉన్నట్టుగా ఒకవైపు ప్రశాంతంగా నిలబడి కనిపించింది. అంతేకాదు టీవీ కెమెరా కూడా ఆ చిన్నారిపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేయడంతో అందరూ కిమ్‌ కూతురేనని విశ్వసిస్తున్నారు.

ఇదిలా జు-ఇ 2013లో జన్మించినట్టు తెలుస్తోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పిల్లల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 2013లో ఉత్తర కొరియాను సందర్శించిన కిమ్‌ స్నేహితుడు, బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ డెన్నిస్‌ రాడ్‌మన్‌ ద్వారా కిమ్‌కు కూతురు ఉన్నట్టు ప్రపంచానికి మొదటిసారి తెలిసింది. ఈ లెక్కన తాజాగా కనిపించిన బాలిక వయస్సు కూడా 9 లేదా పదేళ్లు ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర కొరియా నియంతకు ముగ్గురు సంతానం ఉన్నట్టు 2017లో దక్షిణ కొరియా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ వెల్లడించింది. 2010లో తొలి సంతానంగా కుమారుడు, 2017లో చివరగా మూడో సంతానం పుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కనిపిస్తున్న పాప మాత్రం 2013లో పుట్టినట్టు రాడ్‌మన్‌ ద్వారా తెలిసింది. కానీ చివరి సంతానం ఆగపిల్లా? మగపిల్లాడా? అన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories