లండన్‌లో భారత దౌత్య కార్యాయలంపై.. భారతజెండాను అగౌవరపరిచిన ఖలిస్థాన్ మద్దతుదారులు

Disgrace to National Flag in London
x

లండన్‌లో భారత దౌత్య కార్యాయలంపై.. భారతజెండాను అగౌవరపరిచిన ఖలిస్థాన్ మద్దతుదారులు 

Highlights

London: బ్రిటన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

London: లండన్​లో భారత జాతీయ జెండాకు అవమానం జరిగింది. భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత జెండాను ఎగురవేశారు. భారతీయ జెండాను అగౌరవపరచడంపై యూకే సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చి..బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు..లండన్‌లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తెలిపింది. వెంటనే అక్కడి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసింది.

కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్టులు చేశారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు, మూడు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లో నిరసనలు ప్రారంభించింది. లండన్‌లోని భారత హై కమిషన్‌ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సోషల్​ మీడియాలో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులు భారత హైకమిషన్‌ కార్యాలయానికి వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories