Plane Crash: కజకిస్తాన్‎ విమాన ప్రమాదంలో కుట్రకోణం? ఫ్లైట్‌పై బుల్లెట్ల రంధ్రాలతో అనుమానాలు..

Did Russia shoot down Azerbaijan Airlines plane in Kazakhstan
x

Plane Crash: కజకిస్తాన్‎ విమాన ప్రమాదంలో కుట్రకోణం? ఫ్లైట్‌పై బుల్లెట్ల రంధ్రాలతో అనుమానాలు..

Highlights

Plane Crash: అజర్‌బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలడంతో 38 మంది మరణించారు.

Plane Crash: అజర్‌బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలడంతో 38 మంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజర్‌బైజన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా.. కజకిస్థాన్‌లోని ఆక్టావ్‌లో ఈ విమానం కూలిపోయింది.

పక్షి ఢీ కొట్టడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. కానీ ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ కూలిన సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య దాడులు జరగడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. దానిని కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్టు భావిస్తున్నారు.

ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న తరుణంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్లు ఉన్న ఆనవాళ్లు కనిపించినట్టు తెలిపాయి. అయితే ఈ కథనాలపై కజకిస్థాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించిగా.. సరైన సమాధానం చెప్పలేదు.

ఇదిలా ఉంటే నిన్న క్రిస్మస్ పండగ సమయంలోనూ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగించింది. ఆ దేశంలోని పలు విద్యుత్తు కేంద్రాలపై 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. తాము కనీస 50 క్షిపణులను, పలు డ్రోన్లను కూల్చివేసినట్టు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున భీకర దాడులు జరిపించారని జెలెన్‌స్కీ ఆరోపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories