Coronavirus: భారతీయ యువతి వీడియో : షిప్‌లో చిక్కుకున్నాం సాయం చేయండి మోదీ జీ..

Coronavirus: భారతీయ యువతి వీడియో : షిప్‌లో చిక్కుకున్నాం సాయం చేయండి మోదీ జీ..
x
Highlights

జపాన్ దేశం యోకాహామాలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో చిక్కుకున్న భారతీయ యువతీ సోనాలి ఠక్కర్ కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో...

జపాన్ దేశం యోకాహామాలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో చిక్కుకున్న భారతీయ యువతీ సోనాలి ఠక్కర్ కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తనకు సహాయం కావాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీని అర్ధించారు. ఆమె 14 రోజులుగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమెకు కరోనా వైరస్ పరీక్షలు చేసినా నెగిటివ్ అని వచ్చింది. దాంతో ఆమె కరోనావైరస్ బారిన పడలేదని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తనను భారత్ కు రప్పించేలా సహాయం చెయ్యాలని కోరారు ఆమె.

ఆ వీడియోలో, సోనాలి ఠక్కర్, 'మా కోసం కొంత సహాయం అందించాలని నేను ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించాలనుకుంటున్నాను. మేము 14 రోజులుగా ఇక్కడ ఒంటరిగా ఉన్నాము. మమ్మల్ని ఇప్పటివరకు ఈ ఓడలో ఉంచారు. మా పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. మా సభ్యులందరికి పరీక్షలు పూర్తి చేసి ఈ ఓడ నుండి బయటకు తీసుకెళ్తారని మేము ఎదురు చూస్తున్నాము.' అంటూ ఇటీవల జపాన్ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్ ద్వారా ఆమె ఈ సందేశాన్ని భారత్ కు చేరవేశారు.

మరోవైపు ఠక్కర్‌కు కరోనావైరస్ సోకలేదని తెలిసి, తండ్రి దినేష్ ఠక్కర్ తన కూతురిని తిరిగి భారతదేశానికి తీసుకురావాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 'నా కుమార్తెను ఓడ ద్వారా తిరిగి భారతదేశానికి తీసుకురావాలని నేను భారత ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను' అని ఆయన ప్రముఖ వార్తా సంస్థకి చెప్పారు. అయితే వాస్తవానికి ఆమెతో సహా ఇతర సిబ్బందికి ఎటువంటి తుది పరీక్షలు చేయకపోవడంతో వారు ఇంకా నిర్బంధంలోనే కోనసాగుతున్నారు. ఈ కారణంగానే వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదని తెలుస్తోంది.

కాగా డైమండ్ ప్రిన్సెస్ షిప్‌లో 50 దేశాల నుండి 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. జపాన్ ప్రభుత్వం ఈ నౌకను యోకాహామా నౌకాశ్రయంలో ఉంచింది. ఈ నౌకలో 542 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు, వారిలో 6 గురు భారతీయులు ఉన్నారు. సిబ్బందితో కలిపి మొత్తం 138 మంది భారతీయులు అందులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories