Nepal: నేపాల్‌ విమాన ప్రమాదంలో 68కు చేరిన మృతుల సంఖ్య

Death Toll In Nepal Plane Crash Rises To 68
x

Nepal: నేపాల్‌ విమాన ప్రమాదంలో 68కు చేరిన మృతుల సంఖ్య

Highlights

Nepal: ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు

Nepal: నేపాల్‌లో విమాన ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. నేపాల్ ఖాట్మండ్ విమానాశ్రయంనుంచి బయలు దేరిన విమానం పొఖారాలోని విమానాశ్రయానికి సమీపంలోని సేతి నది ఒడ్డున నియంత్రణ కోల్పోయి క్రాష్ అయింది. కూలిపోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. విమానంలో 68 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంపట్ల భారత ప్రధానమంద్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఖాట్మండ్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 10.33 గంటలకు విమానం బయల్దేరింది. ఉదయం 11 గంటలకు పర్యటక ప్రాంతమైన పొఖారాకు ఇది చేరుకోవాల్సి ఉంది. పొఖారాలోని పాత విమానాశ్రయానికి, నూతనంగా నిర్మించిన విమానాశ్రయానికి మధ్య ఈ విమానం కుప్పకూలింది. ఐదుగురు భారతీయులు సహా 72 మందితో వెళ్తున్న ఓ విమానం ల్యాండింగ్​కు ముందు కుప్పకూలింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

కూలిన విమానంలోంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో మంటల్లోనే ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రయాణికుల్లో ఇద్దరు పసికందులున్నట్లు సమాచారం. కాలిపోతున్న విమానాన్ని పరిసరగ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపకదళాధికారులు మంటలు ఆర్పిన తర్వాత విమాన శకలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

నేపాల్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. 72 మందితో వెళ్తున్న విమానం.. అదుపు తప్పి నదీలోయలో పడిపోయింది. ఈ ఘటనపై భారత్ విచారం వ్యక్తం చేసింది. నేపాల్​లో ఘోర విషాదం జరిగింది. ఐదుగురు భారతీయులు సహా 72 మందితో వెళ్తున్న ఓ విమానం ల్యాండింగ్​కు ముందు కుప్పకూలింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రకారం.. యెటి ఎయిర్​లైన్స్​కు చెందిన 9ఎన్-ఏఎన్​సీ ఏటీఆర్-72 అనే విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఖాఠ్​మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 10.33 గంటలకు విమానం బయల్దేరింది. ఉదయం 11 గంటలకు పర్యటక ప్రాంతమైన పొఖారాకు ఇది చేరుకోవాల్సి ఉంది. పొఖారాలోని పాత విమానాశ్రయానికి, నూతనంగా నిర్మించిన విమానాశ్రయానికి మధ్య ఈ విమానం కుప్పకూలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories