Coronavirus: ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మరణాలు సంఖ్య చూస్తే..

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మరణాలు సంఖ్య చూస్తే..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 5,581 మరణాలు సంభవించాయని.. దీంతో మొత్తం సంఖ్య 349,095 కు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన రోజువారీ నివేదికలో తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 5,581 మరణాలు సంభవించాయని.. దీంతో మొత్తం సంఖ్య 349,095 కు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన రోజువారీ నివేదికలో తెలిపింది.ఇక ధృవీకరించబడిన కేసుల సంఖ్య కొత్తగా 84,314 పెరిగి.. మొత్తం 5,488,825 గా నమోదయిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. సంక్రమణ కేసులు అమెరికా (ఉత్తర ,దక్షిణ అమెరికా) లో ఎక్కువగా నమోదయ్యాయి..

ఇక్కడ మొత్తం కేసులు 2,495,924 ఉండగా..145,810 మరణాలు ఉన్నాయి. అలాగే ఐరోపాలో ఇప్పటివరకు 2,061,828 కేసులు, 1,76,226 మరణాలు నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా 1,63,4010 ఇన్‌ఫెక్షన్లు ఉన్న కేసులు అమెరికాలో ఉన్నాయి. కాగా మార్చి 11 న ప్రపంచ ఆరోగ్య సంస్థ నావెల్ కరోనావైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories