Coronavirus: అమెరికాలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో..

Coronavirus: అమెరికాలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో..
x
Representational Image
Highlights

అమెరికాలో కరోనావైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 1813 మరణాలు సంభవించాయి..

అమెరికాలో కరోనావైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 1813 మరణాలు సంభవించాయి.. అంతేకాదు 21 వేల 712 మందికి వ్యాధి సోకింది. ప్రస్తుతం దేశంలో 14 లక్షల 30 వేల 348 మందికి వ్యాధి సోకింది. అదే సమయంలో, 85 వేల 197 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రమైన న్యూయార్క్‌లో మూడు లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి, ఇక్కడే 27 వేల మంది మరణించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాక్డౌన్ తొలగించాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిని ప్రముఖ పాథాలజిస్ట్ ఆంథోనీ ఫోస్సీ వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పారంభించడం వలన సంక్రమణ ప్రమాదం పెరుగుతుందని ఫోస్సీ చెప్పారు. అయితే తాను ఫోస్సీతో ఏకీభవించనని ట్రంప్ అన్నారు. ఇదిలావుంటే అమెరికా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచింది.. ప్రస్తుతం ఉన్న సంఖ్య త్వరలో 10 మిలియన్లను దాటవచ్చు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సాయంత్రం చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories