బ్రెజిల్ కరోనా మరణాల సంఖ్య ఇటలీని దాటేసింది

బ్రెజిల్ కరోనా మరణాల సంఖ్య ఇటలీని దాటేసింది
x
Highlights

బ్రెజిల్ లో కరోనావైరస్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1,437 మరణాలు, 30,925 అదనపు కరోనావైరస్ కేసులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించినందున, బ్రెజిల్ మొత్తం COVID-19 మరణాల సంఖ్యలో ఇటలీని మించిపోయింది.

బ్రెజిల్ లో కరోనావైరస్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1,437 మరణాలు, 30,925 అదనపు కరోనావైరస్ కేసులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించినందున, బ్రెజిల్ మొత్తం COVID-19 మరణాల సంఖ్యలో ఇటలీని మించిపోయింది. లాటిన్ అమెరికన్ దేశం ఇప్పుడు కరోనావైరస్ నుండి 34,021 మరణాలను నివేదించింది, ఇక పాజిటివ్ కేసులు మాత్రం 6 లక్షల 15 వేల 870కి చేరింది. యునైటెడ్ స్టేట్స్ , యునైటెడ్ కింగ్‌డమ్‌ ల తరువాతి స్థానంలో నిలిచింది.

ఇదిలావుంటే ప్రపంచంలో సోకిన వారి సంఖ్య 67 లక్షల 14 వేల 314 కు పెరిగింది. ఇందులో మొత్తం 32 లక్షల 61 వేల 271 మంది ఆరోగ్యంగా ఉన్నారు. 3 లక్ష 93 వేల 408 మంది మరణించారు. ఉత్తర అమెరికాలో 21 లక్షల 52 వేల 332 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. యుఎస్‌లో 1.9 మిలియన్లకు పైగా కేసులు ఉన్నాయి, ఇది మొత్తం కేసులలో 88% గా ఉంది. అంతకుముందు ఐరోపాలో చాలా మందికి వ్యాధి సోకింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories