కోవాగ్జిన్‌కి WHO నుంచి అనుమ‌తి ల‌భించే అవ‌కాశం..ఇప్ప‌టికే 13 దేశాలు ఆమోదం..

Covaxin is Likely to be Approves by WHO Already Approved by 13 Countries Today 03rd November 2021
x

కోవాగ్జిన్‌కి WHO నుంచి అనుమ‌తి ల‌భించే అవ‌కాశం..ఇప్ప‌టికే 13 దేశాలు ఆమోదం..

Highlights

*భారత్ బయోటెక్ టీకా కోవాక్సిన్‌ని అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై WHO సాంకేతిక కమిటీ నేడు సమావేశం కానుంది.

Covaxin: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈరోజు మేడ్ ఇన్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్.. కోవాక్సిన్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంది. భారత్ బయోటెక్ టీకా కోవాక్సిన్‌ని అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై WHO సాంకేతిక కమిటీ నేడు సమావేశం కానుంది.

అంతకుముందు ఈ కమిటీ రెండుసార్లు భారత్ బయోటెక్ నుంచి వివరణ కోరిన సంగ‌తి తెలిసిందే. గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ కోవాక్సిన్‌ని అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడం కోసం తుది అంచనా నిర్వహించాలని తెలిపింది. ఈ రోజు స‌మావేశంలో ఈ విష‌యం గురించి తేల్చ‌నుంది.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ చాలా దేశాల్లో ఆమోదించారు

ఇప్పటివరకు 6 వ్యాక్సిన్‌లను WHO ఆమోదించింది. వీటిలో ఫైజర్/బయోఎన్‌టెక్ కమిర్నేటి, ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, జాన్సన్ & జాన్సన్స్ వ్యాక్సిన్, మోడర్నా mRNA-1273, సినోఫార్మ్ BBIBP-Corvi, సినోవాక్ కరోనావాక్ ఉన్నాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ప్రయాణికులు తమ దేశాలలోకి ప్రవేశించడానికి కోవాక్సిన్‌ని ఆమోదించిన అనేక దేశాలు ఉన్నాయి. ప్రపంచ

ఈ దేశాల్లో గయానా, ఇరాన్, మారిషస్, మెక్సికో, నేపాల్, పరాగ్వే, ఫిలిప్పీన్స్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్, శ్రీలంక, ఎస్టోనియా మరియు గ్రీస్ ఉన్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్, ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కోవిషీల్డ్ భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే రెండు వ్యాక్సిన్‌లు. ఆస్ట్రేలియా ఇప్పటికే కోవిషీల్డ్‌ని గుర్తించింది.

కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగ ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయాల‌ని ప్రధాని నరేంద్ర మోడీతో సహా జి -20 నాయకులు అంగీకరించారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. G20 సమ్మిట్‌లో నాయకులు 'రోమ్ డిక్లరేషన్'ను స్వీకరించారని, ఆరోగ్య విభాగం కింద ఈ ప్రకటన చాలా బలమైన సందేశాన్ని ఇస్తుంద‌న్నారు.

COVID-19 టీకా ప్రపంచానికి ప్రయోజనకరమని అంగీకరిస్తున్నట్లు గోయల్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్ -19 వ్యతిరేకంగా ఐదు బిలియన్లకు పైగా వ్యాక్సిన్‌ను డోస్‌లను ఉత్పత్తి చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ G20 నాయకులతో అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories