
Countries with highest Women population Than మెన్: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ
Countries with more female population than male in 2025: స్త్రీలు ఎక్కువగా ఉండి పురుషులు తక్కువగా ఉన్న దేశాల జాబితా
Countries with more female population than male in 2025: ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ నమోదయ్యే జనన మరణాలు ఎప్పుడూ సమానంగా ఉండవు. అలాగే ఒక దేశం నుండి మరో దేశానికి మధ్య స్త్రీ, పురుషుల సంఖ్య కూడా ఎప్పుడూ సమానంగా ఉండదు. కానీ కొన్ని దేశాల్లో ఆ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది.
ఉదాహరణకు మన ఇండియాలో ఇప్పుడు మగ పిల్లల సంఖ్య ఎక్కువై లేడీస్ సంఖ్య తక్కువగా ఉంది. ఒకప్పుడు ఆడపిల్లలను చిన్నచూపు చూడటం, బ్రూణ హత్యలు వంటి పరిణామాలే అందుకు కారణమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఏదేమైనా అబ్బాయిలతో పోల్చుకుంటే, పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉండటంతో పెళ్లి కానీ ప్రసాద్‌లకు అమ్మాయిలు దొరకడంలేదు.
ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే, ఇంకొన్ని దేశాల్లో పరిస్ఠితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ మగవాళ్ళ కంటే లేడీసే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆయా దేశాల్లో పెళ్లి విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. అమ్మాయిలకు సరైన జోడీ దొరకడం లేదు. దీంతో భవిష్యత్ తరాల్లో ఆయా దేశాల జనాభా పెరుగుదలపై సైతం అది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరి ఏయే దేశాల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూసొచ్చేద్దాం రండి.
1) నేపాల్
నేపాల్‌లో ప్రస్తుతం మొత్తం 3 కోట్ల 6 లక్షల 82 వేల 170 జనాభా ఉంది. అందులో 1,54,63,712 మంది స్త్రీలు ఉన్నారు. పురుషుల సంఖ్య 1,52,18,458 గా ఉంది. అంటే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ 100 మంది స్త్రీలకు 84 మంది పురుషులే ఉన్నట్లు అక్కడి స్త్రీ-పురుష నిష్పత్తి చెబుతోంది.
2) హాంగ్ కాంగ్
హాంగ్ కాంగ్‌లో ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం అక్కడ స్త్రీల జనాభా శాతం 52.7 శాతంగా ఉంది. అంటే జెంట్స్ కంటే లేడీస్ సంఖ్యే ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ ప్రతీ 100 మంది స్త్రీలకు 84 మంది పురుషులే ఉన్నట్లు స్త్రీ, పురుష నిష్పత్తి లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు... ఐక్య రాజ్య సమితి వద్ద ఉన్న లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల్లో జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువగా ఉన్న దేశాల్లో హాంగ్ కాంగ్ టాప్‌లో ఉంది. హాంగ్ కాంగ్‌లో పరిస్థితి ఏంటో చెప్పడానికి ఈ లెక్క ఒక్కటి చాలు.
3) రష్యా
రష్యా జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం అక్కడ 14,62,12,668 మంది జనాభా ఉంది. అందులో 7,84,90,803 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 53.7 శాతం అన్నమాట. 2021 నాటి లెక్కలను తిరగేసి చూస్తే... రష్యాలో ప్రతీ 100 మంది మహిళలకు 87 మంది మహిళలే ఉన్నారు.
4) ఉక్రెయిన్
రష్యాతో గత మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్నఉక్రెయిన్‌లో కూడా పురుషుల కంటే మహిళల జనాభానే ఎక్కువగా ఉంది. ఉక్రెయిన్ లో 53.67 శాతం జనాభ మహిళలే ఉన్నారు. ఉక్రెయిన్ మొత్తం జనాభా 4,37,34,000 మంది.
అందులో మహిళలు 2,34,71,000.
పురుషులు 2,02,63,000.
ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఉక్రెయిన్‌లో ప్రతీ 100 మంది స్త్రీలకు 86 మంది మహిళలే ఉన్నారు.
5) క్యూరసావో
క్యూరసావో... కరేబియన్ దీవుల్లో ఇదొక చిన్న దేశం. చుట్టూ ప్రకృతి అందాలతో నిండిన ఈ దేశంలో ప్రస్తుతం మొత్తం జనాభా 1,68,657 గా ఉంది. అందులో ఫీమేల్ కౌంట్ 91,531 కాగా మేల్ కౌంట్ కేవలం 77,127 గానే ఉంది.
6) మార్టినిక్
కరీబియన్ దీవుల్లోనే ఉన్న మరో చిన్న దేశం మార్టినిక్. ఈ దేశంలో ప్రస్తుతం 377,119 మంది జనాభా ఉంది. అందులో 200,799 మంది ఫీమేల్ కాగా పురుషుల జనాభా 1,76,320 గా మాత్రమే ఉంది. అంటే మహిళల శాతం 53.2 శాతంగా ఉందన్నమాట. ఇక్కడి జనాభా నిష్పత్తి చూస్తే... ప్రతీ 100 మంది మహిళలకు 85 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
8) లాత్వియా
లాత్వియా... ఉత్తర ఐరోపాలో బాల్టిక్ సముద్రతీరాన ఉన్న మూడు చిన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడూ వార్తల్లో కనిపించని ఈ దేశానికి గొప్ప చరిత్రే ఉందని అక్కడికి వెళ్లొచ్చిన పర్యాటకులు చెబుతుంటారు. మొట్టమొదటిసారిగా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసింది కూడా ఇక్కడే అని చెబుతుంటారు. లాత్వియాలో మొత్తం జనాభా 18 లక్షల 86 వేలుగా ఉంది. అందులో మహిళల జనాభా 54 శాతంగా ఉంది.
9) లిత్వేనియా
ఇప్పుడు మనం చెప్పుకున్న బాల్టిక్ సముద్ర తీరానికి మరో వైపున ఉన్న దేశమే ఈ లిత్వేనియా. భౌగోళికంగా రష్యా, పోలండ్ వంటి దేశాల మధ్య ఉన్న ఈ లిత్వేనియాలో 2023 నాటి లెక్కల ప్రకారం లిత్వేనియాలో 28 లక్షల 70 వేల జనాభా ఉంది. అందులో 53.72 శాతం స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 100 మంది మహిళలకు 86 మంది పురుషులు మాత్రమే ఉన్నట్లు జనాభా నిష్పత్తి చెబుతోంది.
10) బెలారస్
బెలారస్‌లో ప్రస్తుత జనాభా 94 లక్షల 54 వేలుగా ఉంది. అందులో మహిళల సంఖ్య 50 లక్షల 59 వేల 837 గా ఉంది. ఇక పురుషుల సంఖ్య విషయానికొస్తే... 44 లక్షలకు ఇంకో 5 వేలు తక్కువే ఉంది. అంటే ఇక్కడ కూడా జనాభాలో మహిళలదే పై చేయి అన్నమాట.
Also watch this video: Pune Bus Horror Case: 75 గంటల సెర్చ్ ఆపరేషన్... ఒక చిన్న క్లూతో దొరికిపోయిన గాడె
New York Grand Central Station: గిన్నిస్ బుక్ రికార్డులకెక్కిన అద్భుతం! | hm డిజిటల్
Also watch this video: Secunderabad Railway Station Demolition: కుప్పకూలిన 151 ఏళ్ళ చరిత్ర

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




